|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది సినిమా: చికిరి సాంగ్ వివాదం! ఆ పదాన్ని తొలగిస్తున్నారా? అసలు నిజమేంటి?

Published: 27-12-2025, 11:21 AM
పెద్ది సినిమా: చికిరి సాంగ్ వివాదం! ఆ పదాన్ని తొలగిస్తున్నారా? అసలు నిజమేంటి?
  • నటుడు శివాజీ ‘సామాన్లు’ పదంపై వివాదం సద్దుమణగక ముందే కొత్త చర్చ మొదలైంది.
  • పెద్ది సినిమాలోని చికిరి సాంగ్ లిరిక్స్‌లో ‘సరుకు సామాన్’ పదంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది.
  • చికిరి సాంగ్‌లో ‘సరుకు సామాన్’ పద వినియోగంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
  • వివాదాస్పద పదాన్ని తొలగించే లేదా మ్యూట్‌లో ఉంచే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల నటుడు శివాజీ ‘సామాన్లు’ పదం వాడి పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగక ముందే, ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ సాంగ్‌లోని ‘సరుకు సామాన్’ పదంపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఈ పదాన్ని తొలగించే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

శివాజీ వివాదం నుండి పెద్ది సినిమాకు

Peddi : ఇటీవల సామాన్లు అనే పదం వాడి నటుడు శివాజీ ఎంత పెద్ద వివాదంలో చిక్కుకున్నారో చెప్పక్కర్లేదు. ఆ గొడవ ఇంకా సద్దుమణగనే లేదు. చాలా మంది సినిమా సెలబ్రిటీలు శివాజీ కామెంట్స్‌పై విమర్శలు చేస్తుంటే, సోషల్ మీడియాలో మాత్రం శివాజీకి పుల్ సపోర్ట్ దక్కుతోంది.

శివాజీ అలా అంటే యాగీ చేసిన వాళ్లు పెద్ది సినిమాలో అదే పదం ఉంది కదా, దాని గురించి మాట్లాడారా అంటూ కొందరు కొత్త వివాదం మొదలుపెట్టారు. సామాన్లు అనే పదం పెద్ది సినిమాలోని ఓ సాంగ్‌ లిరిక్స్‌గా ఉండటంతో పెద్ద చర్చనే నడుస్తుంది.

చికిరి సాంగ్ లో ‘సరుకు సామాన్’ పద వివాదం

Rajasaab : అసలు ఇదేం ప్లాన్ ‘రాజాసాబ్’.. ఇప్పుడు సడెన్ గా ఇన్ని రోజుల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి..?

పెద్ది సినిమాలో చికిరి చికిరి సాంగ్‌లో సరుకు సామాన్ అనే పదాన్ని రామ్‌చరణ్ హీరోయిన్ దగ్గర పాడటాన్ని బయటకు తీసి ఇది కరెక్టేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో పెద్ది సినిమాలో వాడిన ఆ పదాలపై ఇప్పుడు చర్చ నడుస్తుంది. దీంతో సాంగ్‌లో ఉన్న సరుకు సామాన్ అనే పదాన్ని తొలగించబోతున్నారట.

పద తొలగింపుపై చిత్రయూనిట్ నిర్ణయం?

లేకపోతే ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మ్యూట్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ లిరిక్ యూట్యుబ్, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటే.. రిలీజ్‌ అయ్యే సినిమా ఔట్‌పుట్‌లో మాత్రం సరుకు సామాన్ పదం ఉండదంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మూవీ టీమ్ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సిందే.

‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ సాంగ్‌లో వివాదాస్పద పదం తొలగింపుపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగనుంది. ఈ నిర్ణయం సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.