
📌 Key Points
- రామ్ చరణ్, బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో ‘పెద్ది’ మూవీ డాల్బీ సినిమాస్‌లో విడుదల కానుంది.
- ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
- రామ్ చరణ్ రగ్గడ్ లుక్‌లో కనిపించనుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
- ఫస్ట్ షాట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న డాల్బీ సినిమాస్‌లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
డాల్బీ సినిమాస్‌లో ‘పెద్ది’ విడుదల
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi Movie). ఈ సినిమాతో ఈ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా అత్యాధునిక డాల్బీ సినిమాస్ (Dolby Cinemas) ఫార్మాట్‌లో కూడా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. నిజంగా ఇది ఫ్యాన్స్‌కు సంతోషకరమైన వార్తేనని చెప్పుకోవచ్చు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ సినిమా కోసం రామ్ చరణ్ మాస్ రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి అవతార్‌లో రామ్ చరణ్‌ను డాల్బీ సినిమాస్‌లో చూస్తే వచ్చే కిక్కే వేరు. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే.. ఫ్యాన్స్‌కు మైండ్ పోతోంది. ఇందులో రామ్ చరణ్ చేతిలో బ్యాట్ పట్టుకుని, ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్న తీరు చూస్తుంటే, సినిమాలో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. ‘పెద్ది’ వంటి భారీ యాక్షన్, ఎమోషనల్ డ్రామాను డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో చూడటం ప్రేక్షకులకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుందని.. విజువల్స్, సౌండ్ క్వాలిటీ పరంగా ఈ ఫార్మాట్ ప్రేక్షకులను సినిమాలోని ప్రపంచంలోకి త్వరగా లీనమయ్యేలా చేస్తుందని మేకర్స్ కూడా చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పెద్ది’ ఫస్ట్ షాట్‌కు ఆడియన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రాగా, చరణ్ కెరీర్‌లోనే ఇది ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ రగ్గడ్ లుక్
టెక్నికల్ పరంగా కూడా ‘పెద్ది’ ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా ‘చికిరి చికిరి, రై రై రా రా’ వంటి పాటలు గ్లోబల్ వైడ్‌గా వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి సీనియర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ ఈ చిత్రానికి అదనపు బలాన్ని చేకూర్చునున్నాయి. మొత్తంగా చూస్తే.. ఏప్రిల్ 30న ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు ‘పెద్ది’ జాతరను ఓ రేంజ్‌లో ఇచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం మాత్రం ఇలాంటి అప్డేట్స్‌తో తెలుస్తోంది.
MEGA POWER STAR @AlwaysRamCharan rugged avatar in PEDᗡI 🔥🔥 deserves to be celebrated in #DolbyCinemas ‘s true immersion!
Discover the world of #PEDDI on the grandest scale, in #DolbyCinema ❤️🔥 #PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026
ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల
Coming Soon! #LoveMoviesMoreInDolby … pic.twitter.com/VAL9nD7lzF
— PEDDI (@PeddiMovieOffl) March 12, 2026
మొత్తానికి ‘పెద్ది’ మూవీ రామ్ చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. డాల్బీ సినిమాస్‌లో ఈ సినిమా చూడటం ఒక సరికొత్త అనుభూతినిస్తుందని మేకర్స్ అంటున్నారు.


