
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ మూవీ నుంచి ‘చికిరి చికిరి’ సాంగ్ రిలీజ్ అయి దూసుకుపోతోంది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఈ సాంగ్ సంచలనం సృష్టిస్తోంది.
Key Points
రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో 'పెద్ది' మూవీ తెరకెక్కుతోంది.
'చికిరి చికిరి' సాంగ్ 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల.
“చికిరి చికిరి” సాంగ్ సరికొత్త రికార్డ్
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
పెద్ది మూవీలో నటీనటులు, సాంకేతిక బృందం
సినిమా విడుదల తేదీ, ఇతర వివరాలు
“చికిరి చికిరి” సాంగ్ సాధించిన ఈ భారీ విజయం ‘పెద్ది’ మూవీపై అంచనాలను పెంచింది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


