|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది మాస్ అప్డేట్: బాబాయ్ రికార్డుకు చెర్రీ షాక్! అడ్వాన్స్ బుకింగ్స్ తో విధ్వంసం!

Published: 08-05-2026, 6:01 AM
పెద్ది మాస్ అప్డేట్: బాబాయ్ రికార్డుకు చెర్రీ షాక్! అడ్వాన్స్ బుకింగ్స్ తో విధ్వంసం!
  • నార్త్ అమెరికాలో 24 గంటల్లో $100K వసూలు చేసి పెద్ది సంచలనం.
  • పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నార్త్ అమెరికా రికార్డును బద్దలుకొట్టిన రామ్ చరణ్ ‘పెద్ది’.
  • రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో భారీ బడ్జెట్ తో వస్తున్న ‘పెద్ది’పై అంచనాలు.
  • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతున్న మెగా పవర్ స్టార్ మూవీ.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు! విడుదలకి ముందే సరికొత్త రికార్డులతో చరిత్ర సృష్టిస్తున్న ఈ చిత్రం, అభిమానుల అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ మెగా మానియా వివరాలు చూద్దాం!

పెద్ది విధ్వంసం షురూ!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. జూన్ 4న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 350 కోట్ల బడ్జెట్ లో వృద్ధి సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రారంభం నుంచి ఈ మూవీపై సాలిడ్ బజ్ నెలకొంది.

ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. దీనితో పెద్ది మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే.. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే రికార్డులు బద్దలవుతున్నాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఓజీ రికార్డు బద్దలు! మెగా పవర్ స్టార్ దెబ్బ!

పెద్దిగాడి విధ్వంసం మొదలైది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన 24 గంటల్లోనే నార్త్ అమెరికాలో పెద్ది చిత్రం లక్ష డాలర్లు వసూలు చేసింది. ఏకంగా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రికార్డ్ ని రాంచరణ్ బద్దలు కొట్టారు. ఓజీ మూవీ నార్త్ అమెరికాలో 24 గంటల్లో 82 వేల డాలర్లు సాధించింది.

పెద్ది మ్యానియా చూస్తుంటే మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. దీనితో మెగా అభిమానులు పెద్ది మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్: అంచనాలు ఆకాశంలో!

మొత్తానికి పెద్ది రికార్డుల వేట ఓజీ చిత్రంతోనే ప్రారంభం అయింది. బాబాయ్ సినిమా రికార్డులని అబ్బాయి బ్రేక్ చేశాడు. పెద్ది మూవీ గ్రామీణనేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఆల్రెడీ బుచ్చిబాబు పెద్ది ఫైనల్ ఎడిట్ కూడా కంప్లీట్ చేశారు. ఫైనల్ రన్ టైం మూడు గంటలకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ ‘పెద్ది’తో సృష్టిస్తున్న ఈ రికార్డుల పరంపర చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు ఖాయం అనిపిస్తోంది. మెగా అభిమానుల ఉత్సాహం ఉరకలేస్తోంది. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.