
📌 Key Points
- పెద్ది మూవీలో రామ్ చరణ్‌తో కలిసి ముగ్గురు హీరోయిన్లు స్పెషల్ సాంగ్‌లో చిందులేయనున్నారు.
- స్పెషల్ సాంగ్ కోసం మృణాళ్ ఠాకూర్, తమన్నా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
- మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది.
- సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం ఉండగా, అందులో ముగ్గురు హీరోయిన్లు రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులేయనున్నారు.
పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ విశేషాలు
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు చిత్ర బృందం తెలియచేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం.
నిజానికి ఈ స్పెషల్ సాంగ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి. ఈ పాటలో రామ్ చరణ్ జోడిగా మృణాళ్ ఠాకూర్ నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. బుచ్చి బాబు కూడా తన గురువు సుకుమార్ లాగే స్పెషల్ సాంగ్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తుంది. సాధారణంగా స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్లను దర్శక నిర్మాతలు సంప్రదిస్తూ ఉంటారు కానీ బుచ్చిబాబు మాత్రం బాలీవుడ్ హీరోయిన్లు కాకుండా ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్లను స్పెషల్ సాంగ్ లో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ముగ్గురు హీరోయిన్లు ఎవరు?
ఇప్పటికే పలువురు హీరోయిన్లను బుచ్చిబాబు సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ పాటలో రామ్ చరణ్ సరసన ఒక హీరోయిన్ కాకుండా ముగ్గురు లేదా నలుగురు ఉండేలాగా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారట. మరి రామ్ చరణ్ తో స్పెషల్ స్టెప్పులు వేయబోతున్న ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురిలో మృణాళ్ ఠాకూర్, తమన్నా పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. మరి స్పెషల్ సాంగ్ లో సందడి చేయబోతున్న హీరోయిన్లు ఎవరనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
చరణ్ బర్త్ డే స్పెషల్.. టీజర్ విడుదల?
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ అప్‌డేట్
ఇక ఈ ఒక్క పాట మినహా షూటింగ్ దాదాపు పూర్తి అయిందని తెలుస్తోంది. డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టారు. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించిన విషయాన్ని బుచ్చిబాబు తెలియజేశారు. ఇక మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆరోజు సినిమా నుంచి బిగ్ అప్డేట్ రాబోతుందని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి టీజర్ క విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం అవుతుంది. మరి చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారో వేచి చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా ఈ పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది.
మొత్తానికి, పెద్ది సినిమాలోని స్పెషల్ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ పుట్టినరోజున విడుదలయ్యే టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల కోసం వేచి చూడాల్సిందే.


