|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘పెద్ది’ సెట్స్ నుండి సంచలన అప్డేట్! రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇక పండగే!

Published: 21-03-2026, 2:05 AM
‘పెద్ది’ సెట్స్ నుండి సంచలన అప్డేట్! రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇక పండగే!
  • రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
  • గచ్చిబౌలిలో వేసిన భారీ సెట్‌లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
  • ఏప్రిల్ 6 నుంచి 12 మధ్య రెండు పాటల చిత్రీకరణ పూర్తి కానుంది.
  • ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గచ్చిబౌలిలో ‘పెద్ది’ క్లైమాక్స్ షూటింగ్

Peddi Shooting Update : టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పి నా ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్టరు ఇటీవల రిలీజ్ అయింది ప్రస్తుతం అది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రాంచరణ్ తో పాటుగా వెనకాల రాముడి విగ్రహం కూడా కనిపించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుందని మెగా అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా వాయిదా పడుతుంది అని గత రెండు రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. ప్రస్తుతం పెద్ది షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ఎక్కడ షూటింగ్ జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా షూటింగులో వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇప్పుడు క్లైమాక్స్ సీన్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. గచ్చిబౌలిలో పెద్ది సినిమా కోసం ఏర్పాటుచేసిన భారీ సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని సమాచారం. మరో నాలుగు రోజులు పాటు ఇక్కడే షూటింగ్ జరుగుతుందట. దీంతో పాటుగా మరో రెండు పాటలు కూడా పెండింగ్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రెండు పాటల్ని ఏప్రిల్ 6 నుంచి 12 లోపల పూర్తి చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసి మిగిలిన కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసుకుని ఏప్రిల్ 30న థియేటర్లోకి వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట.. త్వరలోనే ఈ మూవీ నుంచి మరొక క్రేజీ అప్డేట్ రాబోతుందని సమాచారం..

ఏప్రిల్ 30న విడుదల కానున్న ‘పెద్ది’

త్వరలో రానున్న క్రేజీ అప్డేట్

రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీ అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అలాగే నిన్న రిలీజ్ అయిన రై రై రారా సాంగ్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ పాటపై రీల్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి శ్రీరామ్ మీ సందర్భంగా మరో అప్డేట్ రాబోతుందని సమాచారం. అలాగే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి అనౌన్స్ చెయ్యబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. మార్చి 27 అర్ధరాత్రి 12 సమయం నుండి ఓవర్సీస్ ప్రేక్షకులు తమ టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రత్యంగిరా సినిమాస్ ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ​మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మరి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. ఏప్రిల్ 30న థియేటర్లలో చూసి ఆనందించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.