
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమెను ఎంపిక చేయడం వెనుక కారణాలు ఏంటో చూద్దాం.
Key Points
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో ఐటెం సాంగ్ ఉంటుంది.
ప్రారంభంలో శ్రీ లీలాను పరిశీలించారు, కానీ పూజా హెగ్డేను ఎంచుకున్నారు.
పూజా హెగ్డే గతంలో 'జిగేల్ రాణి'లో ఐటెం సాంగ్ చేసింది.
'డిజాస్టర్' హీరోయిన్ అయినా పూజాను ఎంచుకోవడం ఆసక్తికరం.
‘పెద్ది’ సినిమా ఐటెం సాంగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పెద్ది సినిమాతో ( Peddi) ఫుల్ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో పెద్ది సినిమాలో ఐటెం సాంగ్ ( Item song) ఉంటుందని… అందులో ఓ హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ ఐటెం సాంగ్ కోసం మొదట శ్రీ లీలాను అనుకున్నారట. కానీ చివరికి ఆమెను కాదని పూజ హెగ్డేను ( Pooja Hegde) ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో జిగేల్ రాణి ఐటెం సాంగ్ లో కూడా పూజ హెగ్డే నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ సెంటిమెంట్ ను పెద్ది సినిమాలో.. వాడుకోవాలని చూస్తున్నారు. డిజాస్టర్ హీరోయిన్ అయినప్పటికీ పూజ హెగ్డేను తీసుకోవాలని అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పూజా హెగ్డే ఎంపిక
డిజాస్టర్ హీరోయిన్
ప్రస్తుతం ఈ వార్తలకు అధికారిక నిర్ధారణ లేదు. అయితే, పూజా హెగ్డే ‘పెద్ది’లో ఐటెం సాంగ్ చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. వార్తలకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


