
📌 Key Points
- ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’ పేరుతో తెరకెక్కుతోంది.
- మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కనిపించనున్నారు.
- బాహుబలి, కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
- మూడు నెలల క్రితం ప్రకటించిన సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మా వందే’ బయోపిక్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నటిస్తున్నారు. బాహుబలి, కేజీఎఫ్ వంటి భారీ చిత్రాల టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
మోదీ పాత్రలో మలయాళ నటుడు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కబోతోంది. మా వందే అనే టైటిల్ తో ఈ సినిమాను తీయనున్నారు. శనివారం సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాని మోదీ పాత్ర పోషిస్తున్నారు. సినిమ ముహూర్తానికి సంబంధించిన వీడియోను నటుడు ఉన్ని ముకుందన్ పంచుకున్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన వ్యక్తి కథను చెప్పేందుకు కొత్త అధ్యాయం మొదలైందని పేర్కొన్నారు.
ఈ ఏడాది సెప్టెంబరులోనే ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించగా.. 3 నెలల తర్వాత షూటింగ్ ప్రారంభమయింది. బాహుబలికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కేకే సెంథిల్ కుమార్, కేజీఎఫ్, సలార్ సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన రవి బస్రూర్, నేషనల్ అవార్డు గ్రహీత, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, స్టంట్ డైరెక్టర్ కింగ్ సోలమన్ వంటి దిగ్గజాలు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ పతాకంపై వీర్ రెడ్డి ఎం. ఈ సినిమాను నిర్మిస్తుండగా.. క్రాంతి కుమార్ సిహెచ్ రచన దర్శకత్వం వహిస్తున్నారు.
దిగ్గజ టెక్నీషియన్ల భాగస్వామ్యం
పూజా కార్యక్రమాలతో షూటింగ్ షురూ
ప్రధాని మోదీ జీవిత కథను తెరపైకి తీసుకురానున్న ఈ భారీ ప్రాజెక్ట్ సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. దిగ్గజ టెక్నీషియన్లతో, నూతన నటుడితో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


