|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పూజా హెగ్డేకు పెద్ద షాక్, కోలీవుడ్ లో కూడా ఎదురుదెబ్బ

Published: 10-07-2025, 5:55 AM
పూజా హెగ్డేకు పెద్ద షాక్, కోలీవుడ్ లో కూడా ఎదురుదెబ్బ

టాలీవుడ్‌లో మెరిసిన పూజా హెగ్డే ఇటీవల వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా, ధనుష్ సినిమాలోని అవకాశం కూడా ఆమె చేజారింది. దీంతో ఆమె కెరీర్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Key Points

1

పూజా హెగ్డేకు వరుస ఫ్లాపులు తీవ్రమైన దెబ్బ.

2

ధనుష్ సినిమాలోని అవకాశం మిస్ అయింది.

4

పూజా కెరీర్ ఇప్పుడు కష్టకాలంలో ఉంది.

వరుస ఫ్లాపులతో పూజా హెగ్డే కెరీర్‌కు గండి

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది పూజా హెగ్డే. ఈమధ్య వరుస ఫ్లాపులతో కెరీర్‌లో వెనుకపడుతోంది బ్యూటీ. ఒకదశలో భారీ రెమ్యునరేషన్ అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటించిన పూజా.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుండడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజా సమాచారం మేరకు ఆమెకు దక్కాల్సిన ఓ క్రేజీ ఆఫర్ ఆమె చెయిజారినట్టు తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుసగా హిట్ సినిమాలు చేస్తున్న క్రమంలో ఆయన నెక్ట్స్ సినిమా దర్శకుడు విగ్నేష్ రాజా తో చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫిక్స్ చేశారట టీమ్. తమిళంలో వరుసగా ఆమె సినిమాలు చేస్తుండటంతో ధనుష్ సినిమా కోసం పూజాకు ఆఫర్ రెడీ చేశారట. కాని అక్కడ కూడా వరుసగా పూజా సినిమాలన్నీ ప్లాప్ అవుతుండటంతో పూజాను పక్కన పెట్టేసి, ఆమె ప్లేస్ లో మలయాళ యాక్ట్రెస్ మమితా బైజును ఎంపిక చేసినట్టు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. .

ధనుష్ సినిమా అవకాశం చేజారడం

ఇక పూజా హెగ్డే కు చాలా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆమె నటించిన ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, వరుసగా హ్యాట్రీక్ ఫెయిల్యూర్ చూసిన తరువాత పూజాకు ఆఫర్లు తగ్గిపోయాయి. అంతే కాదు రీసెంట్ గా విడుదలైన ‘రెట్రో’ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావడంతో ఆమె మార్కెట్‌లో క్రేజ్ కాస్త తగ్గింది. ఇక విజయ్ దేవరకొండతతో జనగణమణ ఆగిపోవడం, మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తూనే తప్పుకోవడం.. ఇలా ఎటు చూసుకున్నా పూజా కెరీర్ కు అన్నీ మైనస్ అయ్యాయి.

ఒకప్పుడు హాట్ డిమాండ్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. . ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి భారీ ప్రాజెక్ట్‌ను కోల్పోవడం ఆమెకు మరో పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. మరోవైపు, మమితా బైజు తాజాగా వచ్చిన మలయాళ సినిమా ‘ప్రేమలు’సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ సినిమాతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న ఆమె ప్రస్తుతం దళపతి విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల ప్రాజెక్టులలో అవకాశం దక్కించుకుంది. తాజాగా పూజా హెగ్డే చేయాల్సిన ధనుష్ సినిమా అవకాశం కూడా మమితా దక్కించుకోవడంతో ఆమె కెరీర్ పరుగులు పెట్టబోతోంది.

మమితా బైజుకు అవకాశం దక్కడం

ఇక ధనుష్ హీరోగా విగ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. త్వ‌రలో చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్‌మెంట్ ఇవ్వనుంది. మమితా బైజు ఇందులో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్టు వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక పూజా హెగ్డే ప్రస్తుతం తన చేతిలో ఉన్న కొన్ని ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టి మళ్లీ పుంజుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

వరుస ఫ్లాపులు, కోలీవుడ్‌లో అవకాశం కోల్పోవడం పూజా హెగ్డే కెరీర్‌కు పెద్ద ఎదురుదెబ్బ. మళ్ళీ సక్సెస్ పొందేందుకు ఆమె కష్టపడాల్సి ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.