|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పూజా హెగ్డే: ఐరన్ లెగ్ నుండి ఐటెం సాంగ్ వరకు.. త్రివిక్రమ్ మాయాజాలం?

Published: 27-03-2026, 2:05 AM
పూజా హెగ్డే: ఐరన్ లెగ్ నుండి ఐటెం సాంగ్ వరకు.. త్రివిక్రమ్ మాయాజాలం?
  • పూజా హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా వెలుగొందింది.
  • ఫ్లాప్ సినిమాలతో పూజా ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకుంది.
  • త్రివిక్రమ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి పూజా ఒకే చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
  • గుంటూరు కారం సినిమా నుండి పూజా తప్పుకోవడంతో శ్రీలీలకు అవకాశం వచ్చింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన పూజా హెగ్డే ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేయడానికి సిద్ధమైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఆమె ఐటెం సాంగ్ లో కనిపించనుందని సమాచారం.

పూజా హెగ్డే: గోల్డెన్ లెగ్ నుండి ఐరన్ లెగ్ వరకు

Pooja Hegde: పూజా హెగ్డే.. ఒకప్పుడు ఈ పేరుకున్న డిమాండ్ అంటా ఇంతా కాదు. ఈ అమ్మడు డేట్స్ లేక పోస్ట్ పోన్ చేసుకున్న సినిమాలెన్నో.ఒకరకంగా హీరోలందరికీ ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ అయిపోయింది, కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.రాధే శ్యామ్ (Radhe Shyam),ఆచార్య (Acharya),బీస్ట్ (Beast) ,కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan),సర్కస్ (Cirkus)..ఇలా చేసిన సినిమా చేసినట్టే అడ్డంగా పోవడంతో ఆ గోల్డెన్ లెగ్ కాస్తా ఐరన్ లెగ్ అయిపొయింది.ఇక మెయిన్ లీడ్ గా సినిమాలు కరువడంతో పూజా బేబీ తప్పేలా లేదని మళ్ళీ ఐటం సాంగ్ కే ఒకే చెప్పిందన్న వార్త మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

అయితే అది లక్కీ జోడీగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కాంబోలో కావడం గమనార్హం. అవును.. వరుసగా ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలతో పూజాకు స్టార్ స్టేటస్ అందించిన గురూజీ తన అప్ కమింగ్ సినిమా ఆదర్శ కుటుంబంలో ఐటం….అదే  అదే స్పెషల్ సాంగ్ కి ఫిక్స్ చేశాడన్న టాక్ వినిపిస్తుంది .

మీకు గుర్తుందా ..గుంటూరు కారం సినిమాలో మొదటగా హీరోయిన్ గా ఫిక్స్ అయింది ఈ అమ్మడే.కానీ కారణాలేవైనా సడన్ గా ప్రాజెక్ట్ నుండి ఎగ్జిట్ ఇచ్చి మేకర్స్ కి పెద్ద షాకే ఇచ్చింది. దీంతో పూజా ప్లేస్ లో శ్రీలీల ని పెట్టేసి, శ్రీలీల ప్లేస్ ని మీనాక్షి తో ఫిల్ చేశాడు గురూజీ. అయితే ఈ ఇష్యూ తర్వాతే పూజాకి టాలీవుడ్ లో చాన్సులు తగ్గాయి అన్నవారూ లేకపోలేదు. ఇక అప్పటి నుండి అడ్రస్ లేని పూజా త్రివిక్రమ్ కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తె పాత గొడవలు సెటిల్ అయిపోయాయా లేక సినిమాలు లేక ఇలా స్పెషల్ సాంగ్ లో ఎంట్రీ ఇస్తుందా అంటూ డౌట్స్ రైజ్ చేస్తున్నారు మూవీ లవర్స్.

ఆదర్శ కుటుంబంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్

ఇక ప్రస్తుతం వెంకీ మామ హీరోగా గురూజీ డైరెక్షన్ లో ఆదర్శకుటుంబం షూట్ యమా జోరుగా సాగుతున్న సంగతి తెల్సిందే.ఇక ఇప్పటికే వెంకీ కి జోడీగా శ్రీనిధి శెట్టి ఆన్ బోర్డ్ అయింది కూడా . అయితే ఇందులో వచ్చే ఓ క్రేజీ పెప్పి నంబర్ కోసమే పూజా ని రంగంలోకి దింపబోతున్నాడని ఇన్ సైడ్ టాక్ .ఇక గతంలో పూజా ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా, ‘F3’లో స్పెషల్ సాంగ్‌తో ఊపేసిన సంగతి తెల్సిందే.మరి తన అప్పీరియన్స్ తో ఆ సినిమాలకి మరో రేంజ్ సెట్ చేసిన ఈ బుట్ట బొమ్మ ఆదర్శ కుటుంబానికి ఎలా అచ్చి వస్తుందో చూడాలి. ఏది ఏమైనా త్రివిక్రమ్ మూవీస్ లో మెయిన్ లీడ్ గా చేసిన పూజా ఆ దర్శకుడి సినిమాలో స్పెషల్ సాంగ్ కి అడ్జస్ట్ అవడం అంటే బుట్టబొమ్మ ఎలాంటిది ఎలా అయిపొయింది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

అఫీషియల్ అప్ డేట్ ఎప్పుడో …

గుంటూరు కారం ఎఫెక్ట్: మళ్లీ త్రివిక్రమ్ తో పూజా

అయితే త్రివిక్రమ్‌ గతంలో ఇలాగే ఇలియానా, సమంతలను వరుసగా ఎంకరేజ్ చేయడం తెల్సిందే.మరి హీరోయిన్ చాన్సులు అంతంత మాత్రంగానే ఉన్న బుట్ట బొమ్మ ఈ మాస్ బీట్ కి ఒకే చెబుతుందా లేక చల్లగా సైడ్ అవుతుందా అనేది అఫీషియల్ అప్ డేట్ వస్తే కాని తెలీదు.

మొత్తానికి పూజా హెగ్డే మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో కనిపించనుండడం విశేషం. ఐటెం సాంగ్ ద్వారా ఆమె తన ఫామ్ ను తిరిగి పొందుతుందో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.