|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పూనమ్ కౌర్ సంచలనం: చేతబడితో పెద్ద ప్రమాదం.. మొహంపై 18 ఇంజెక్షన్లు వేయాల్సి వచ్చింది!

Published: 02-01-2026, 8:30 AM
పూనమ్ కౌర్ సంచలనం: చేతబడితో పెద్ద ప్రమాదం.. మొహంపై 18 ఇంజెక్షన్లు వేయాల్సి వచ్చింది!
  • నటి పూనమ్ కౌర్‌పై చేతబడి చేశారని స్వయంగా వెల్లడి.
  • చేతబడి కారణంగా పెద్ద ప్రమాదం జరిగి మొహంపై 18 ఇంజెక్షన్లు వేయాల్సి వచ్చింది.
  • మూడున్నరేళ్లు నరకం అనుభవించానని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.
  • చేతబడి చేసినవారు ఆ తర్వాత చనిపోయారని సంచలన వ్యాఖ్యలు.

నటి పూనమ్ కౌర్ ఇటీవల తనపై చేతబడి జరిగిందని, దాని ఫలితంగా తీవ్రమైన ప్రమాదానికి గురయ్యానని సంచలన విషయాలు వెల్లడించారు. తన ముఖంపై 18 ఇంజెక్షన్లు వేయాల్సి వచ్చిందని, మూడున్నరేళ్లు నరకం అనుభవించానని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చేతబడి ఆరోపణలు, ప్రమాదం వెనుక కథ

Poonam Kaur: పూనమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె సినిమాలలో హీరోయిన్ గా నటించినది చాలా తక్కువ. సినిమాలలో హీరోయిన్ గాను , హీరోలకు చెల్లెలి పాత్రలలోను హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో కూడా నటించి పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూనమ్ కౌర్ (Poonam Kaur)సినిమాల కంటే కూడా వివాదాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఈమె ముక్కు సూటి మనస్తత్వంతో సోషల్ మీడియా వేదికగా ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా పూనమ్ కౌర్ చేసే పోస్టులు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఇండస్ట్రీలో కొంతమంది పై తీవ్ర విమర్శలు కురిపించిన పూనమ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తనకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా తానంటే నచ్చని వాళ్ళు తనపై చేతబడి(Black Magic) చేశారు అంటూ ఈ సందర్భంగా  పూనమ్ తెలియజేశారు. ఇలా చేతబడి చేసిన తర్వాత తనకు పెద్ద యాక్సిడెంట్ జరిగిందని, మొహం మొత్తం గాయాలు, మొహంపై దాదాపు 18 ఇంజక్షన్లు వేసారని తనకు జరిగిన ప్రమాదం గురించి తెలియజేశారు. ఇలా చేతబడి కారణంగానే తనకు ఈ యాక్సిడెంట్ అయిందని దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు  నరకం అనుభవించానని తెలిపారు..

యాక్సిడెంట్ తర్వాత మూడున్నరేళ్ల నరకం

ఇలా యాక్సిడెంట్ తర్వాత తాను కాశ్మీర్ పెళ్లి తన తండ్రి  వర్ధంతి కార్యక్రమాలలో  ఉన్నాను. అదే సమయంలోనే నాపై ఎవరైతే చేతబడి చేశారో వాళ్ళు చనిపోయారు అంటూ ఈ సందర్భంగా పూనమ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె వ్యాఖ్యలపై అభిమానులు స్పందిస్తూ అసలు ఈమెపై చేతబడి చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరు చేశారు? చనిపోయింది ఎవరు? అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో తనకు ఎదురైన సంఘటనల గురించి మా అసోసియేషన్ తన విషయంలో వ్యవహరించిన తీరు గురించి కూడా మాట్లాడారు.

శివాజీ వివాదం పై పూనమ్ రియాక్షన్..

ఇండస్ట్రీ, రాజకీయాలపై పూనమ్ కౌర్ వ్యాఖ్యలు

ఇక ఇటీవల కాలంలో పూనమ్ కౌర్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.అయితే ఈమె  రాజకీయాలలోకి వెళ్ళబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి కానీ  ఇది నిజం కాదని తెలుస్తోంది. రాజకీయాలలోకి వెళ్లకపోయినా ఈమె నిత్యం రాజకీయాల గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. ఇక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇండస్ట్రీలోని సెలబ్రిటీల గురించి ఇండస్ట్రీ వ్యవహారాల గురించి స్పందిస్తూ పోస్టులు చేస్తుంటారు. ఇటీవల శివాజీ మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా పూనమ్ స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.

పూనమ్ కౌర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాలతో పాటు అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె ఆరోపణలు, వాటి వెనుక ఉన్న నిజాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.