|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ అగ్గిరాజేసే వ్యాఖ్యలు: ‘మహిళలపై వేధింపులకు కారణం అతనే!’

Published: 01-01-2026, 12:30 AM
త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ అగ్గిరాజేసే వ్యాఖ్యలు: 'మహిళలపై వేధింపులకు కారణం అతనే!'
  • పూనమ్ కౌర్ త్రివిక్రమ్‌పై ‘అత్యంత దుర్మార్గుడు’ అంటూ సంచలన ట్వీట్ చేసింది.
  • రీ-రిలీజ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ ప్రమోషన్స్ వీడియోపై త్రివిక్రమ్ వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం.
  • త్రివిక్రమ్ మహిళలను మానసిక క్షోభకు గురిచేసి, వేధింపులకు కారణమవుతున్నారని పూనమ్ తీవ్ర ఆరోపణ.
  • మీడియా, ‘మా’ అసోసియేషన్ మౌనంపై కూడా పూనమ్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకుడు త్రివిక్రమ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సంచలన ట్వీట్ చేసింది. ‘అతను అత్యంత దుర్మార్గుడు, మహిళలను మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు’ అంటూ పూనమ్ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

పూనమ్ కౌర్ ఆగ్రహం: అసలు కారణం ఏంటి?

వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న పూనమ్ కౌర్(Poonam Kaur) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో నిత్యం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ.. వార్తల్లో నిలుస్తుంటుంది. అప్పుడప్పుడు మాత్రం ఎవరినో ఒకరిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ పోస్టులు షేర్ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లపై పలు సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. గతంలో ఆమె గురూజీ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్టుల చేయడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో త్రివిక్రమ్‌ను గురూజీ అని పిలుస్తుంటారు కాబట్టి ఆయనని ఉద్దేశించే పెట్టిందని అంతా భావించేవారు. తాజాగా, పూనమ్ కౌర్ డైరెక్ట్ ఎటాక్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడిన వీడియోపై సంచలన పోస్ట్ పెట్టడంతో పెద్ద దుమారమే రేపింది. ఆయన్ని అత్యంత దుర్మార్గుడు అని పేర్కొనడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

త్రివిక్రమ్ ‘గురూజీ’పై పరోక్ష పోస్టులు

అసలు విషయంలోకి వెళితే.. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ న్యూయర్ కానుకగా రీరిలీజ్ అయింది. రవి కిషోర్, విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాకు కథ త్రివిక్రమ్(Trivikram) అందించారు. అయితే ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్‌తో పాటు ఆయన కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొన్ని సినిమాలు డబ్బు పేరు తీసుకొస్తాయిన.. కానీ కొన్ని మాత్రమే గౌరవాన్ని తెస్తాయని అన్నారు. ఇక ఈ వీడియోను కొంతమంది మీడియా వారు, నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చూసిన పూనమ్ రెచ్చిపోయింది. ఈమేరకు సంచలన ట్వీ్ట్ పెట్టింది. ‘‘స్త్రీలను మానసిక క్షోభకు గురిచేసి, ఏమీ తెలియనట్టు తప్పించుకోగల అత్యంత దుర్మార్గపు వ్యక్తి అతను.

మీడియా, ‘మా’ అసోసియేషన్‌పై పూనమ్ విమర్శలు

మీలాంటి మీడియా అతనికి మద్దతు ఇవ్వడం వల్ల, అలాగే ‘మా’ (MAA) అసోసియేషన్ లాంటి వారు ఇలాంటి వారి బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించకపోవడం వల్లే ఇది సాధ్యమవుతోంది. కానీ సాధారణంగా వదిలేయాల్సిన ఒక చిన్న కామెంట్‌ను పట్టుకుని గొప్పగా షేర్ చేస్తున్నారు. మీలాంటి వారి వల్లే మహిళలపై వేధింపులు పెచ్చుమీరుతున్నాయి’’ అని త్రివిక్రమ్ వీడియో కింద రాసుకొచ్చింది. ఆయన పేరు ప్రస్తావించనప్పటికీ వీడియోకు పెట్టడంతో అది కాస్త వివాదాస్పదంగా మారుతోంది. అది చూసిన నెటిజన్లు ఆమెను దారుణంగా తిడుతున్నారు. link

త్రివిక్రమ్ వీడియోను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. నెటిజన్ల మధ్య కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.