|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ ట్విస్ట్: ప్రెగ్నెన్సీపై పూనమ్ పాండే సంచలన ప్రకటన! నిజమెంత?

Published: 01-04-2026, 7:31 AM
షాకింగ్ ట్విస్ట్: ప్రెగ్నెన్సీపై పూనమ్ పాండే సంచలన ప్రకటన! నిజమెంత?
  • పూనమ్ పాండే బేబీ బంప్‌తో ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు షాక్.
  • ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన పూనమ్ పాండే, అది ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అని వెల్లడి.
  • ప్రపంచ ఉద్రిక్తతల నడుమ కాసేపు నవ్వించాలనే ఉద్దేశంతో ప్రాంక్ చేసినట్టు తెలిపిన పూనమ్.
  • పూనమ్ పాండే చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్.

పూనమ్ పాండే తన ప్రెగ్నెన్సీ వార్తలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే, ఇది ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అని ఆమె స్వయంగా వెల్లడించారు.

పూనమ్ పాండే ప్రెగ్నెన్సీ ప్రకటన కలకలం

Poonam Pandey Pregnancy: పూనమ్ పాండే పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల కాలంలో వరుస వివాదాలలో నిలుస్తున్న ఈమె తరచూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంటాయి. గతంలో క్యాన్సర్ తో చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. ఇది నిజమేనని అభిమానులు భావించారు కానీ మరుసటి రోజు తాను బ్రతికే ఉన్నానని ఊహించని షాక్ ఇచ్చారు. అయితే క్యాన్సర్ పై అవగాహన కోసమే తాను ఇలా చేశానంటూ అప్పుడు చెప్పుకువచ్చారు.

ఇకపోతే తాజాగా పూనం పాండే ఇటీవల సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్(Baby Bump) తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాలలో వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు పూనమ్ పాండే తల్లి కాబోతోందా? ఈమె షేర్ చేసిన ఫోటోలు నిజమైనవేనా? అంటూ ఎంతోమంది ఎన్నో సందేహాలను వ్యక్తపరిచారు. బేబీ బంప్ ఫోటో వెనుక ఎలాంటి ట్విస్ట్ దాగి ఉందో అంటూ చాలామంది ఈమె ప్రెగ్నెన్సీ రూమర్లపై కామెంట్లు చేశారు. ఇలా పూనమ్ పాండే ప్రెగ్నెన్సీ (Pregnancy)గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఆమె స్పందిస్తూ అసలు విషయాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా పూనమ్ పాండే ఒక వీడియోని షేర్ చేస్తూ.. తన ప్రెగ్నెన్సీ గురించి అలాగే బేబీ బంప్ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకున్నట్టు తాను ప్రెగ్నెంట్ కాదని అది ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అంటూ ఈమె అసలు విషయాన్ని పెట్టారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నడుమ అందరిని కాసేపు అలరించాలనే ఉద్దేశంతో తాను ఇలా చేశానని, ఈ విషయాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు, లైఫ్ ను చిల్ చేయండి అంటూ పూనం పాండే ఒక వీడియోని విడుదల చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అని వెల్లడి

ప్రముఖ నటి పూనమ్ పాండే తన ప్రెగ్నెన్సీ వార్తలపై ఎట్టకేలకు నోరు విప్పారు.

తాను గర్భవతిని కాదని, అదంతా ఒక ‘ఏప్రిల్ ఫూల్ ప్రాంక్’ అని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అందరినీ కాసేపు అలరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆమె తెలిపారు. “నన్ను సీరియస్… pic.twitter.com/By4tz3dHuT

నెటిజన్ల స్పందన

— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026

ఈమె ప్రెగ్నెన్సీ ఫోటోలు చూసి అందరూ ఏప్రిల్ ఫూల్ ఫ్రాంక్ అనే సందేహాలను వ్యక్తపరిచిన విధంగానే ఈమె కూడా ప్రాంక్ వీడియోతో మరోసారి అందరిని నమ్మించే ప్రయత్నం చేయటంతో ఈమె పట్ల సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఈమె గురించి ఎన్నోసార్లు వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈమె మాత్రం తన వ్యవహార శైలి మార్చుకోవడం లేదని తెలుస్తోంది . గతంలో కూడా గర్భాశయ క్యాన్సర్ అంటూ ఈమె ఒక వీడియోని షేర్ చేశారు. ఆ సమయంలో ఎన్నో విమర్శలు వచ్చిన మరోసారి ప్రెగ్నెంట్ అంటూ ఫోటోలను షేర్ చేస్తూ మరోసారి విమర్శల పాలయ్యారు.

చివరిగా, పూనమ్ పాండే తన ప్రెగ్నెన్సీ వార్త ఒక ప్రాంక్ అని చెప్పడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.