|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Prabhas Movie : బాబోయ్.. ఇంకెన్ని సెకండ్ పార్టులు.. ఇంకో సినిమాకు ప్రభాస్ మళ్ళీ రెండో పార్ట్ అంట..

Published: 17-11-2025, 7:41 AM
Prabhas Movie : బాబోయ్.. ఇంకెన్ని సెకండ్ పార్టులు.. ఇంకో సినిమాకు ప్రభాస్ మళ్ళీ రెండో పార్ట్ అంట..

ప్రభాస్ సినిమాలు అంటే ఇప్పుడు సీక్వెల్స్ పరంపర మొదలైంది. బాహుబలి తర్వాత కల్కి, సలార్ చిత్రాలకు పార్ట్ 2లు ప్రకటించిన ప్రభాస్, ఇప్పుడు మరో సినిమాకు ప్రీక్వెల్ ఆలోచనలో ఉన్నాడట. హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న ఫౌజీ సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడైంది. ఇది అభిమానులలో ఆసక్తి రేపుతోంది.

Key Points

1

ప్రభాస్ సినిమాలకు సీక్వెల్స్ లేదా ప్రీక్వెల్స్ ప్రకటనలు పెరిగాయి.

2

కల్కి, సలార్ సినిమాలకు ఇప్పటికే పార్ట్ 2లు ప్రకటించారు.

4

ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ దశలో ఉంది; కొత్త హీరోయిన్ ఇమాన్వి నటిస్తోంది.

ప్రభాస్ చిత్రాల సీక్వెల్స్ పరంపర

Prabhas Movie : బాహుబలి సినిమా వచ్చిన తర్వాత చాలా మంది రెండో పార్ట్ అంటూ మొదలుపెట్టారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, సినిమాకు రెండో పార్ట్ అవసరం లేకపోయినా కొన్ని సినిమాలు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ప్రకటిస్తున్నాయి. కొంతమంది స్టార్ హీరోలు మాత్రం తమ సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించి మరింత హైప్ పెంచుతున్నారు. అలాంటి వాళ్లలో ప్రభాస్ ముందుంటాడు.

బాహుబలి సినిమాతో రెండు పార్టులు అని మొదలు పెట్టిన ప్రభాస్ ఆ తర్వాత కల్కి సినిమాకు, సలార్ సినిమాలకు కూడా సీక్వెల్స్ ప్రకటించాడు. కానీ ఆ రెండు సినిమాలు ఇప్పటికి కూడా మొదలుకాలేదు. అసలు అవి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు మొదలవుతాయి కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో మరో ప్రభాస్ సినిమాకు రెండో పార్ట్ ఉందట. అయితే అది సీక్వెల్ కాదు ప్రీక్వెల్.

ఫౌజీ సినిమాకు ప్రీక్వెల్ ప్లాన్

ఇంతకీ అదేం సినిమా అనుకుంటున్నారా. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా. తాజాగా హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫౌజీ సినిమాకు ప్రీక్వెల్ ఉండొచ్చు, ఆ ఆలోచన ఉంది అని అన్నారు. దీంతో ఫౌజీ సినిమాకు కూడా ఇంకో పార్ట్ ఉండటం ఖాయం అంటున్నారు.

ప్రభాస్ చేతిలో ఆరు సినిమాలకు పైగా

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో యుద్ధం నేపథ్యంలో, ఓ ప్రేమకథతో కూడా సినిమాగా ఫౌజీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో కొత్త అమ్మాయి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. 2026 చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలకు పైగా ఉండగా అందులో మూడు సినిమాలకు సంబంధిచి రెండో పార్ట్ ఉండటం గమనార్హం.

ప్రభాస్ సినిమాలకు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ రావడం సహజమే అయినా, ఫౌజీ సినిమా ప్రీక్వెల్ వార్త అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ప్రభాస్ ప్రణాళికలు చూస్తుంటే, రాబోయే సంవత్సరాల్లో మరింత వినోదం ఖాయం అనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.