|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Prabhas : మళ్ళీ డ్యాన్స్ మాస్టర్ తో ప్రభాస్ సినిమా.. అప్పుడు ప్రభుదేవా, లారెన్స్.. ఇప్పుడు ఎవరంటే?

Published: 14-11-2025, 11:33 PM
Prabhas : మళ్ళీ డ్యాన్స్ మాస్టర్ తో ప్రభాస్ సినిమా.. అప్పుడు ప్రభుదేవా, లారెన్స్.. ఇప్పుడు ఎవరంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుదేవా, లారెన్స్ వంటి డ్యాన్స్ మాస్టర్స్ దర్శకత్వంలో నటించిన ప్రభాస్, ఇప్పుడు ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Key Points

1

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.

2

గతంలో ప్రభుదేవా (పౌర్ణమి), లారెన్స్ (రెబెల్) దర్శకత్వంలో ప్రభాస్ నటించాడు.

4

ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ కెరీర్ ప్రభాస్ 'ఛత్రపతి' సినిమాతోనే మొదలైంది.

ప్రభాస్ భారీ ప్రాజెక్టుల మధ్య కొత్త సినిమా?

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు అన్ని భారీ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలను చేతిలో పెట్టుకొని వరుస హిట్స్ కొడుతూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. చేతిలో ఆల్రెడీ అరడజను సినిమాలు ఉన్నా ఇంకా కొత్త కథలు వింటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ మరో కొత్త సినిమా ఓకే చేసాడని సమాచారం.(Prabhas)

గతంలో డ్యాన్స్ మాస్టర్స్ డైరెక్టర్స్ గా మారగా ప్రభాస్ వాళ్ళ దర్శకత్వంలో నటించాడు. ప్రభుదేవాతో పౌర్ణమి సినిమా, లారెన్స్ మాస్టర్ తో రెబెల్ సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు కొంతమేరకు మెప్పించినా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఇంకో డ్యాన్స్ మాస్టర్ తో సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.

గతంలో డ్యాన్స్ మాస్టర్స్ దర్శకత్వంలో ప్రభాస్

సీనియర్ డ్యాన్స్ మాస్టర్, RRR లో నాటు నాటు సాంగ్ తో వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న మాస్టర్ ప్రేమ్ రక్షిత్ దర్శకుడిగా మారబోతున్నాడు. ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడని టాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ప్రభాస్ కి కథ చెప్పాడని, ప్రభాస్ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడని తెలుస్తుంది.

ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ప్రభాస్ నిజమేనా?

ప్రేమ్ రక్షిత్ కెరీర్ కొరియోగ్రాఫర్ గా మొదలైంది ప్రభాస్ ఛత్రపతి సినిమాతోనే. ఆ తర్వాత బిల్లా, డార్లింగ్, బాహుబలి సినిమాలకు ప్రభాస్ తో కలిసి పనిచేసాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. మరి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తాడా చూడాలి.

ప్రేమ్ రక్షిత్ కెరీర్ ప్రారంభం ప్రభాస్ సినిమాతోనే కావడంతో, వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ కొత్త కాంబినేషన్ నిజమైతే, అభిమానులకు ఇది ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అవుతుంది. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.