
ప్రభాస్ తన బిగ్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ సినిమా సెట్స్‌లో గొప్ప మనసు చాటుకున్నారు. నటీనటుల కోసం ఇంటి నుంచి రుచికరమైన భోజనం పంపించారు. దీనిపై హీరోయిన్ ఇమాన్వి ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Key Points
ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ప్రభాస్ స్వయంగా తన ఇంటి నుంచి షూటింగ్ బృందానికి రుచికరమైన భోజనం పంపించారు.
హీరోయిన్ ఇమాన్వి ఈ భోజనంపై కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
గతంలో కూడా ప్రభాస్ తన సినిమాల సెట్స్‌లో సహచరులకు ఇలాంటి ఆతిథ్యం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.
ప్రభాస్ స్వయంగా తెప్పించిన భోజనం
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ మూవీలో చేస్తున్నారు. అంతేకాకుండా హను రాఘవపూడితో జతకట్టారు మన బాహుబలి హీరో. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంంలో హీరోయిన్‌గా ఇమాన్వి కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.
తాజాగా ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ తమ కోసం ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మీ ఇంటి భోజనం తిని కడుపుతో పాటు గుండె కూడా ప్రేమతో నిండిపోయిందని క్యాప్షన్ రాసుకొచ్చింది. థ్యాంక్ యూ ప్రభాస్ గారు అంటూ ఇమాన్వి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రభాస్ చేయించిన వెరైటీ వంటకాలను వీడియోను రూపంలో పోస్ట్ చేసింది. కాగా.. ప్రభాస్ గతంలో కూడా తన సినిమాల షూటింగ్ సమయంలో స్వయంగా తానే భోజనాలు తయారు చేయించారు. తన మూవీ షూటింగ్‌లో పాల్గొన్న అందరికీ కూడా కడుపునిండా భోజనం పెట్టి తన గొప్ప మనసును చాటుకుంటూనే ఉన్నారు.
హీరోయిన్ ఇమాన్వి కృతజ్ఞతలు
ఫౌజీ సినిమా అప్‌డేట్స్
ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో పీరియాడికల్ డ్రామా ‘ఫౌజీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.
ప్రభాస్ తన సినిమాల సెట్స్‌లో అందరికీ ఆతిథ్యం ఇవ్వడం ఇది కొత్త కాదు. ఈసారి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వి ఆతిథ్యానికి మురిసిపోయింది. ప్రభాస్ గొప్ప మనసు మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.


