|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Prabhas : కృష్ణం రాజు అలా అనేసరికి.. ప్రభాస్ ఏకంగా స్పెషల్ ఫ్లైట్ తెప్పించి ఏం చేసాడంటే..

Published: 03-12-2025, 3:50 AM
Prabhas : కృష్ణం రాజు అలా అనేసరికి.. ప్రభాస్ ఏకంగా స్పెషల్ ఫ్లైట్ తెప్పించి ఏం చేసాడంటే..
  • ప్రభాస్ – కృష్ణం రాజు మధ్య అపురూప అనుబంధం.
  • శ్యామల దేవి ఇటీవల ఇంటర్వ్యూలలో పలు విషయాలు వెల్లడించారు.
  • కృష్ణం రాజుగారు బోర్ కొడుతుందని చెప్పగానే ప్రభాస్ స్పందించిన తీరు.
  • కుటుంబాన్ని మాల్దీవ్స్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో పంపించి ఆశ్చర్యపరిచారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తన పెదనాన్న కృష్ణం రాజుపై ఉన్న అంతులేని ప్రేమను ఇటీవల నిరూపించుకున్నారు. కృష్ణం రాజు భార్య శ్యామల దేవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ప్రకారం, బోర్ కొడుతుందని చెప్పగానే ప్రభాస్ ఏకంగా ఓ స్పెషల్ ఫ్లైట్ తెప్పించి కుటుంబ సభ్యులందరినీ మాల్దీవ్స్‌కు పంపించారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రభాస్ – కృష్ణం రాజు అనుబంధం

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో సంక్రాంతికి రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రభాస్ కి తన పెదనాన్న కృష్ణం రాజు అంటే ఎంత ఇష్టం, వీరిద్దరి మధ్య అనుబంధం ఎంత ఉండేదో అందరికి తెలిసిందే.(Prabhas)

ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ మీడియాతో మాట్లాడుతున్నారు. పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణం రాజు భార్య శ్యామల దేవి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు.

శ్యామల దేవి ఆసక్తికర విషయాలు

శ్యామల దేవి మాట్లాడుతూ.. ఓ సారి కృష్ణం రాజు గారు బోర్ కొట్టేస్తుందని అన్నారు ప్రభాస్ తో. దాంతో బాబు(ప్రభాస్) స్పెషల్ ఫ్లైట్ తెప్పించి మా అందర్నీ మాల్దీవ్స్ కి పంపించారు. బోర్ కొడుతుంది కదా వెళ్లి ఎంజాయ్ చేసి రండి అన్నాడు ప్రభాస్ పెదనాన్నతో. బాబు రాలేదు కానీ కృష్ణం రాజు గారిని, నన్ను, ఫ్యామిలీ అందర్నీ పంపించాడు. నెలన్నర రోజులు అక్కడ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసి వచ్చాము. కృష్ణంరాజు గారు కూడా అక్కడ బాగా ఎంజాయ్ చేశారు అని తెలిపారు.

మాల్దీవ్స్‌కు స్పెషల్ ఫ్లైట్ కథ

ప్రభాస్ భోళాతనం గురించి అందరికి తెలిసిందే. ఫుడ్ కడుపునిండా పెట్టడంలో, ఎవరికైనా సహాయం చేయడంలో ప్రభాస్ ముందుంటారు. కానీ కృష్ణం రాజు జస్ట్ బోర్ కొడుతుందని అడిగితే ఏకంగా స్పెషల్ ఫ్లైట్ తెప్పించి అందర్నీ మాల్దీవ్స్ పంపించడం ఏంట్రా బాబు అని ఆశ్చర్యపోతున్నారు అంతా.

ప్రభాస్ పెద్ద మనసు, తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమను ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. కేవలం బోర్ కొడుతుందన్న చిన్న మాటకే ఇంత పెద్ద పని చేసిన ప్రభాస్ ఔదార్యం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.