
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా టైటిల్‌పై బిగ్ అప్‌డేట్ బయటపడింది. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఓ ఇంటర్వ్యూలో నోరుజారి ప్రభాస్-హను రాఘవపూడి సినిమా పేరు ‘ఫౌజీ’ అని చెప్పేశాడు. కొన్ని సీన్స్ చూసి షాకయ్యానని ప్రదీప్ తెలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నిండింది.
Key Points
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ టైటిల్ లీక్ చేశాడు.
ప్రభాస్-హను రాఘవపూడి సినిమాకు 'ఫౌజీ' టైటిల్ కన్ఫర్మ్ చేసిన ప్రదీప్.
ప్రభాస్ 'ఫౌజీ' సినిమా సీన్స్ షాకింగ్‌గా, అద్భుతంగా ఉన్నాయని ప్రదీప్ తెలిపాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రెండో ప్రపంచయుద్ధం బ్యాక్ డ్రాప్ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ప్రభాస్ మూవీ టైటిల్ లీక్ చేసిన ప్రదీప్
Prabhas: డ్యూడ్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే(Prabhas) రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో, ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచిన టీం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
Salman-Dil Raju: సల్మాన్ తో దిల్ రాజు మూవీ.. డైరెక్టర్స్ ఎవరు దొరకడం లేదా.. మళ్ళీ అతనే..
ఫౌజీ: ప్రభాస్-హను రాఘవపూడి సినిమా వివరాలు
ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో ప్రదీప్ రంగనాథన్ నోరు జారాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న నెక్స్ట్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు… ప్రభాస్-హను రాఘవపూడి సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “నేను ప్రభాస్ హీరోగా చేస్తున్న “ఫౌజీ” సినిమాలో కొన్ని సీన్స్ చూశాను. ఆ సీన్స్ షాక్ అయ్యేలా ఉన్నాయి. అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, ప్రదీప్ రంగనాథన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న ప్రదీప్ కామెంట్స్, ఫ్యాన్స్ స్పందన
నిజానికి, ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడితో సినిమా ఒక సినిమా చేస్తున్నాడు అని తెలుసు. రెండో ప్రపంచయుద్ధం బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ ఇదే అని మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ, “ఫౌజీ” టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉందనే ఉహాగానాలు వ్యక్తం అవుతూవస్తున్నాయి. కానీ, ఇప్పుడు అదే టైటిల్ అంటూ ప్రదీప్ కన్ఫర్మ్ చేశేశాడు. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ కటౌట్ కి పర్ఫెక్ట్ టైటిల్ ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, టైటిల్ చెప్పి అందరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రదీప్ కి థాంక్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, దీనిపై “ఫౌజీ” సినిమా మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ప్రదీప్ నోరుజారడం ప్రభాస్ అభిమానులకు భారీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ‘ఫౌజీ’ టైటిల్ పర్ఫెక్ట్ అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ లీక్‌పై మేకర్స్ అధికారికంగా ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.


