
📌 Key Points
- ‘ది రాజా సాబ్’ క్లైమాక్స్ దాదాపు 40 నిమిషాల పాటు ఉండనుంది: మారుతి.
- ఈ సినిమాలో ఐదు నుండి ఆరు యాక్షన్ సీన్లు, రెండు భారీ యాక్షన్ సీన్లు ఉంటాయట.
- హర్రర్ కామెడీ నేపథ్యంతో పాటు నానమ్మ-మనవడి ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయని మారుతి తెలిపారు.
- 15 ఏళ్ల తర్వాత ప్రభాస్ నుండి మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని మారుతి హామీ ఇచ్చారు.
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా క్లైమాక్స్ పై డైరెక్టర్ మారుతి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. క్లైమాక్స్ దాదాపు 40 నిమిషాల పాటు ఉండబోతుందని, ఇది సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
మారుతి సంచలన ప్రకటన: క్లైమాక్స్ 40 నిమిషాలు
The Raja Saab: డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో పాన్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్(The Raja Ssab). ఈ సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 9వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే సినిమా నుంచి వరుస అప్డేట్స్ కూడా తెలియజేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ మంచి అంచనాలను పెంచేసింది.
ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండో ట్రైలర్ విషయంలో ప్రేక్షకులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాలో క్లైమాక్స్ దాదాపు 40 నిమిషాల పాటు ఉండబోతుందని, ఈ 40 నిమిషాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని మారుతి తెలియజేశారు. చివరి 35 నుంచి 40 నిమిషాలు పాటు ఏం జరుగుతుందనే ట్రాన్స్ లోకి ప్రేక్షకులు వెళ్లిపోతారు. ఈ సినిమా కథ యాక్షన్ డ్రామాతో పాటు కొన్ని ఎలిమెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయని ఈ సినిమాలో ఏకంగా ఐదు నుంచి 6 యాక్షన్ సీన్లు రెండు భారీ యాక్షన్ సీన్లు ఉంటాయని తెలియజేశారు.
‘రాజా సాబ్’లో యాక్షన్, ఎమోషనల్ సీన్లు
ఈ విధంగా రాజా సాబ్ సినిమా గురించి మారుతి ఈ స్థాయిలో చేసిన వ్యాఖ్యల పట్ల భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక చెప్పిన విధంగా సినిమాలో ఏమాత్రం లేకపోయినా, ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరిచినా భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. 40 నిమిషాల పాటు క్లైమాక్స్ ఉండబోతుందనే విషయం తెలియజేయడంతో మారుతి డేర్ చేస్తున్నారంటూ మరి కొంతమంది ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాన్నమ్మ మనవడి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయని మారుతి తెలిపారు.
15 ఏళ్ల తర్వాత ఎంటర్టైన్మెంట్ ..
అంచనాలకు మారుతి సవాల్‌గా నిలుస్తాడా?
ఇటీవల కాలంలో ప్రభాస్ విభిన్న జానర్ లో సినిమాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన నుంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందని అభిమానులు భావించారు కానీ 15 సంవత్సరాల తర్వాత మంచి ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. మరి సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించిన సందడి చేయబోతున్నారు.
మారుతి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ‘ది రాజా సాబ్’పై అంచనాలను అమాంతం పెంచాయి. చెప్పిన విధంగా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. లేకపోతే విమర్శలను ఎదుర్కోవాల్సి రావచ్చు.


