|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ స్పిరిట్ సినిమాకు బ‌న్నీ ప్ర‌చారం..రెబ‌ల్ టీ-ష‌ర్ట్ వేసుకుని మ‌రీ !

Published: 02-12-2025, 2:30 PM
ప్రభాస్ స్పిరిట్ సినిమాకు బ‌న్నీ ప్ర‌చారం..రెబ‌ల్ టీ-ష‌ర్ట్ వేసుకుని మ‌రీ !
  • ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.
  • ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారిగా, తృప్తి డిమ్రి హీరోయిన్‌గా కనిపించనున్నారు.
  • అల్లు అర్జున్ పదేళ్ల క్రితం ‘రెబల్, స్పిరిట్’ అని ఉన్న టీ-షర్ట్ ధరించాడు.
  • బన్నీ టీ-షర్ట్ వైరల్‌గా మారి, ప్రభాస్ సినిమా ప్రచారంపై ఊహాగానాలకు దారితీసింది.

ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా వార్తలు వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ధరించిన ఓ పాత టీ-షర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పదేళ్ల క్రితం బన్నీ ధరించిన ఈ “రెబల్, స్పిరిట్” టీ-షర్ట్ ఇప్పుడు ప్రభాస్ సినిమా ప్రచారానికి దారితీసిందా అనే చర్చ మొదలైంది.

ప్రభాస్ ‘స్పిరిట్’ వివరాలు

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రభాస్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛ‌త్రపతి, బాహుబలి లాంటి సినిమాలు చేసి, పాన్‌ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. అయితే అలాంటి ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ ‘రెబల్’ టీ-షర్ట్ వైరల్

ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో కబీర్ సింగ్ గా మెరిసిన షాహిద్ క‌పూర్‌ కూడా ప్రత్యేక రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

పదేళ్లనాటి జోస్యం.. ప్రచారమా?

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వేసుకున్న ఓ టీ షర్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెబల్, స్పిరిట్ అని రాసి ఉన్న టీ షర్ట్ ను అల్లు అర్జున్ ధ‌రించాడు. అది ఇప్పుడు కూడా కాదు, సరిగ్గా 10 సంవత్సరాల కింద‌టే, రెబల్, స్పిరిట్ పేరుతో ఉన్న టీ షర్ట్ ను ధరించాడు అల్లు అర్జున్. దీంతో ప్రభాస్ సినిమాకు అల్లు అర్జున్ ప్రచారం మొదలు పెట్టాడని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అయితే 10 సంవత్సరాల కిందటే స్పిరిట్ గురించి అంచనా వేసి, ఆ టీ-ష‌ర్ట్‌ ధరించాడని మరి కొంతమంది అంటున్నారు. దీంతో మొత్తానికి రెబల్ స్టార్ టీ షర్ట్ వేసుకున్న అల్లు అర్జున్ వీడియో వైరల్ గా మారింది.

మొత్తానికి అల్లు అర్జున్ వేసుకున్న పాత టీ-షర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం పదేళ్లనాటి యాదృచ్ఛికమా లేక ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాకు పరోక్ష ప్రచారమా అని సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.