
📌 Key Points
- ప్రభాస్ ‘స్పిరిట్’ డిజిటల్ హక్కులకు భారీగా రూ.350 కోట్ల ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
- ఓటీటీ ఆఫర్లను రిజెక్ట్ చేయడానికి గల కారణం సినిమాపై ఉన్న నమ్మకమేనని మేకర్స్ అంటున్నారు.
- అక్టోబర్ 23, 2026న ‘స్పిరిట్’ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.
- ప్రస్తుతం ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రభాస్, సందీప్ వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా డిజిటల్ హక్కులకు భారీగా ఆఫర్లు వస్తున్నప్పటికీ, మేకర్స్ వాటిని తిరస్కరించారు. సినిమా అవుట్‌పుట్ చూశాకే రేటు ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. దీనికి కారణం సినిమాపై ఉన్న నమ్మకమే.
‘స్పిరిట్’ డిజిటల్ హక్కులకు భారీ ఆఫర్లు!
Prabhas Spirit: యానిమల్ తర్వాత ప్రభాస్ తో సినిమా అనగానే అంచనాలు ఆకాశంలోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా కలెక్షన్స్ 2000 కోట్లని, డిజిటల్ రైట్స్ 300 కోట్లని, టోటల్ గా రికార్డులన్నీ రీరైట్ అని ఇలా ఎవరికి ఊహించినట్టుగా వాళ్లు లెక్కలేసుకోవడం మొదలెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏకంగా 300 నుండి 350 కోట్లు ఆఫర్
సందీప్ వంగా గత సినిమా యానిమల్ కి ఓటిటీలో ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. దీంతో అదే క్రేజ్ కారణంగా ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ కోసం నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఏకంగా 300 నుండి 350 కోట్లు ఆఫర్ చేయడానికి రెడీ అయ్యాయన్న వార్తలు నెట్టింట్లో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే మేకర్స్ లెక్క మాత్రం వేరుగా ఉంది. స్పిరిట్ కి ఉన్న క్రేజ్ వేరే అని, ఇప్పుడు ఓటిటి లు ఆఫర్ చేస్తున్న దానికి కమిట్ అయితే రేపు సినిమా టీజర్ లేదా ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత వచ్చే హైప్‌ను క్యాష్ చేసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారట. సో సినిమా అవుట్‌పుట్ చూసాకే రేట్లను ఫిక్స్ చేయాలని వారు అనుకుంటున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే సినిమా కంటెంట్ అండ్ క్వాలిటీ మీద మేకర్స్ కి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతుంది. మరో వైపు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ దగ్గర పెట్టుబడికి లోటు లేకపోవడం కూడా ఇలాంటి డేరింగ్ డిసీషన్ తీసుకోవడానికి ఒక కారణం అని చెప్పాలి.
ఓటీటీ ఆఫర్లను తిరస్కరించడానికి కారణం ఇదేనా?
అక్టోబర్ 23, 2026న ఒక పవర్ ఫుల్ గ్లింప్స్
నిజానికి ఒక పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయిన వెంటనే ఓటిటి, శాటిలైట్ హక్కుల కోసం పోటీ మొదలవుతుంది. కానీ స్పిరిట్ విషయంలో మేకర్స్ వేసిన ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. అయితే సినిమా కాస్త అటూ ఇటూ అయినా వీళ్ల స్ట్రాటజీ బూమరాంగ్ అవడం ఖాయం.ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యమా జోరుగా జరుగుతోంది. ఈ మధ్యే షూటింగ్ సెట్స్‌లో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగి కొంత ఇబ్బంది ఏర్పడ్డా షూటింగ్ షెడ్యూల్స్ అలాగే కంటిన్యూ అవుతాయని, సినిమా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అంటే షూటింగ్ ఇలాగే స్పీడ్ గా జరిగితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23, 2026న ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉందన్న మాట.
అక్టోబర్ 23న ‘స్పిరిట్’ గ్లింప్స్ విడుదల!
2027 మార్చి 5 వరకు వేచి చూడాల్సిందే
ప్రభాస్ మొదటిసారిగా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా భారతీయ భాషలతో పాటు కొరియన్ భాషలో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండటం విశేషం.ఇక త్రిప్తీ డిమ్రి హీరోయిన్‌గా, వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా చూడాలంటే మాత్రం ఫ్యాన్స్ 2027 మార్చి 5 వరకు వేచి చూడాల్సిందే.
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మేకర్స్ తీసుకుంటున్న నిర్ణయాలు సినిమాపై వారి నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


