
📌 Key Points
- ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమా రూపొందుతున్నది.
- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
- 2027 మార్చి 5న స్పిరిట్ సినిమా విడుదల కానుంది.
- ఈ సినిమా రిలీజ్ డేట్ ని సందీప్ రెడ్డి స్వయంగా ప్రకటించారు.
ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీ విడుదల తేదీని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనూహ్యంగా ప్రకటించారు. ఈ సినిమా 2027 మార్చి 5న విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్రభాస్ స్పిరిట్ మూవీ అప్డేట్స్
Spirit Release Date: ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటించిన ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల కావడంతో ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాతో పాటు సందీప్ రెడ్డి(Sandeep Reddy) డైరెక్షన్ లో స్పిరిట్ (Spirit)సినిమాలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఇదివరకు ఎప్పుడు కనిపించని విధంగా ఈ సినిమాలో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గత ఏడాది నవంబర్ లో షూటింగ్ ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక జనవరి 1వ తేదీని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఇలా ఒక్క పోస్టర్ తోనే సినిమా పై సందీప్ రెడ్డి భారీ అంచనాలను పెంచేశారు.ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని, ఏడాది డిసెంబర్ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ సందీప్ రెడ్డి ఈ సినిమా విడుదల తేదీని అధికారికగా ప్రకటించారు. ఈయన ఎలాంటి హడావిడి,ముందస్తు సమాచారం లేకుండా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు.
సందీప్ రెడ్డి రిలీజ్ డేట్ ప్రకటన
Spirit release date 🙂 #Spirit pic.twitter.com/PyUrDoxw7d
— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 16, 2026
ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్
స్పిరిట్ సినిమాని 2027 మార్చ్ 5వ తేదీ విడుదల చేయబోతున్నట్లు సందీప్ రెడ్డి అధికారకంగా వెల్లడించడంతో ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఊహించని విధంగా ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా త్రిప్తి దిమ్రి నటిస్తున్న విషయం తెలిసిందే. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
మొత్తానికి ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సందీప్ రెడ్డి వంగా విడుదల తేదీని ప్రకటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.


