|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి షాకింగ్ అప్‌డేట్: మాస్ ప్లాన్ వెనుక భారీ ట్విస్ట్?

Published: 02-01-2026, 4:00 AM
ప్రభాస్ 'స్పిరిట్'పై సందీప్ రెడ్డి షాకింగ్ అప్‌డేట్: మాస్ ప్లాన్ వెనుక భారీ ట్విస్ట్?
  • సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కుతోంది.
  • న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ అంచనాలను పెంచింది.
  • ప్రభాస్ మందు బాటిల్, సిగరెట్‌తో షర్ట్‌లెస్ మాస్ లుక్‌లో కనిపించాడు.
  • సినిమా షూటింగ్ 25% పూర్తైంది; అసలైన పోలీస్ గెటప్ త్వరలో రానుంది.

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఉత్కంఠను పెంచింది. తాజాగా సినిమా షూటింగ్ పురోగతి, రాబోయే షాకింగ్ అప్‌డేట్స్ అభిమానులను మరింత ఆకర్షిస్తున్నాయి.

స్పిరిట్: సందీప్ రెడ్డి వంగా మార్క్ ఫస్ట్ లుక్

Spirit New Update: ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ అంటూ ప్రతి చిత్రంతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డివంగా.. ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న చిత్రం స్పిరిట్(Spirit ). ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా, భారతీయ బాక్సాఫీస్ బాహుబలిగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్.. హీరోగా వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు సందీప్ రెడ్డి వంగ. అలా వచ్చిన స్పిరిట్ లుక్ అభిమానులలో విపరీతమైన అంచనాలను పెంచేసింది.

హీరోని మాత్రమే ఎలివేట్ చేయకుండా హీరోయిన్ కూడా ఈ పోస్టర్ లో చూపించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఒక చేతిలో మందు బాటిల్.. నోటిలో సిగరెట్టు పెట్టుకొని ప్రభాస్ కనిపించగా.. ఆ సిగరెట్టును త్రిప్తి వెలిగిస్తున్నారు. ఇక ప్రభాస్ ను వెనుక నుంచి చూపించిన సందీప్.. ప్రభాస్ ఒంటినిండా గాయాలతో షర్ట్ లెస్ లుక్ లో కనిపించారు. ఇకపోతే ఈ ఫస్ట్ లుక్ లోనే తన మాస్ స్టైల్ చూపించారు సందీప్ రెడ్డి వంగ. ఇక ఇదే స్టైల్ లో సినిమా కూడా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు.

షూటింగ్ అప్‌డేట్: అసలు గెటప్ త్వరలోనే!

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. అసలు విషయంలోకి వెళితే.. ఈ స్పిరిట్ సినిమా షూటింగ్ దాదాపు 25% పూర్తయింది. ఇప్పటివరకు పూర్తిచేసిన షూటింగ్ నుండి తీసిన ఫుటేజ్ మాత్రమే మనతో పంచుకున్నారు. అసలైన పోలీస్ ఆఫీసర్ గెటప్ త్వరలోనే బయటకు రానుంది. ఒకవేళ ఆ పోస్టు గనుక బయటకు వచ్చింది అంటే కచ్చితంగా ఇంటర్నెట్ ను షేక్ చేయడం ఖాయమని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అయితే ఈ లుక్ బయటకు రావడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.

ప్రభాస్ అభిమానులకు మెగా సర్‌ప్రైజ్

అయితే తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మాత్రం సందీప్ రెడ్డివంగా ప్రత్యేక శైలి అలాగే ప్రభాస్ అభిమానుల కోసం అందించిన ఒక చిన్న కానుక మాత్రమే. అసలే పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్న ప్రభాస్ తో సందీప్ రెడ్డివంగా జతకట్టారు అనే వార్త వచ్చినప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పుడు షూటింగ్ పై అప్డేట్ ఇస్తూనే త్వరలోనే అసలైన పోస్టర్ పంచుకుంటామని చెప్పడం మరింత సంచలనంగా మారింది. ఏది ఏమైనా ప్రభాస్ ను ఈ సినిమాలో మునుపేన్నడూ చూడని గెటప్లో చూడబోతున్నామని తెలిసినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులలోనే కాదు ఇటు ఆడియన్స్ లో కూడా అంచనాలు పెరిగిపోయాయి. మరి అందరి అంచనాలను ఈ సినిమా ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి.

మొత్తంగా, ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రయోగాలు, షాకింగ్ అప్‌డేట్స్‌తో అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇదివరకు చూడని గెటప్‌లో ప్రభాస్‌ను చూడబోతున్నామనే వార్త, రాబోయే అసలైన పోలీస్ పోస్టర్ కోసం ఉత్కంఠను మరింత పెంచుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.