|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ముద్దు సీన్లతో ప్రభాస్ కష్టాలు! సందీప్ రెడ్డి వంగా షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో?

Published: 08-04-2026, 10:35 AM
ముద్దు సీన్లతో ప్రభాస్ కష్టాలు! సందీప్ రెడ్డి వంగా షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో?
  • స్పిరిట్ సినిమాలో తొలిసారి లిప్ లాక్ సీన్‌లో నటించిన ప్రభాస్.
  • ముద్దు సీన్ చేయడానికి మొదట నో చెప్పిన ప్రభాస్.
  • సందీప్ వంగా సీన్ ప్రాముఖ్యతను వివరించి ప్రభాస్‌ను ఒప్పించారు.
  • సెట్‌లో తక్కువ మంది సమక్షంలో సీన్ షూటింగ్.

ప్రభాస్ తన కెరీర్‌లో chưa ఎన్నడూ లేని విధంగా స్పిరిట్ సినిమాలో ముద్దు సన్నివేశంలో నటించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ముద్దు సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

స్పిరిట్‌లో ప్రభాస్ లిప్ లాక్ సీన్

Prabhas Spirit: డార్లింగ్ ప్రభాస్ అంటేనే ఆరడుగుల కటౌట్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు. అలాంటి ప్రభాస్  పర్సనల్ లైఫ్‌లో ఎంత సిగ్గుపడతారో, హీరోయిన్లతో మాట్లాడాలన్నా ఎంత మొహమాటపడతారో మనం చాలా ఇంటర్వ్యూల్లో చూశాం కూడా. అలాంటి ప్రభాస్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా లాంటి ‘రా’ అండ్ ‘బోల్డ్’ డైరెక్టర్ తో స్పిరిట్ చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే లేటెస్ట్ గా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా గురించి వస్తున్న ఒక క్రేజీ అప్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

ఇప్పటి వరకు అలాంటి సీన్లు చేయని ప్రభాస్

యస్ …స్పిరిట్ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఒక లెంగ్తీ లిప్ లాక్ సీన్‌లో నటించారట.సాధారణంగా ప్రభాస్ సినిమాల్లో రొమాన్స్ ఉన్నా అది చాలా పద్ధతిగా, డీసెంట్‌గా ఉంటుంది. కానీ సందీప్ వంగా అలా కాదు. ఆయన సినిమాలో ఎమోషన్ పండాలంటే రొమాన్స్ కూడా అంతే డీప్‌గా ఉండాలనుకుంటారు.అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలు అది ప్రూవ్ చేశాయ్ కూడా.ఈ క్రమంలోనే స్పిరిట్ కథలో ఒక కీలక సందర్భంలో వచ్చే ఈ కిస్ సీన్ గురించి ప్రభాస్‌కు చెప్పినప్పుడు,ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారట.”అసలు నా వల్ల అవుతుందా ..ఇలాంటి సీన్లు ఇప్పటివరకు చేయలేదు, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో” అని మొహమాటపడ్డాడట డార్లింగ్.అయితే  మొదట ‘నో’ అన్నా, సందీప్ వంగా మాత్రం వదలకుండా ఆ సీన్ వెనుక ఉన్న ఇంటెన్సిటీని, అది కథను ఎంతలా ఎలివేట్ చేస్తుందో వివరించి డార్లింగ్‌ను ఒప్పించారని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.

చాలా ప్రైవేట్‌గా ఈ లిప్ లాక్ సీన్‌ను షూట్ చేసిన డైరెక్టర్

ముద్దు సీన్ చేయడానికి ప్రభాస్ మొహమాటం

ఇక షూటింగ్ రోజే అసలైన డ్రామా జరిగిందట.ప్రభాస్ ఆ సీన్ చేయడానికి సిద్ధపడినా, సెట్‌లో అందరూ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారట ప్రభాస్. దీంతో హీరో ఇబ్బందిని అర్థం చేసుకున్న డైరెక్టర్ వెంటనే రంగంలోకి దిగి, సెట్‌ను ఖాళీ చేయించేశారు. కేవలం కెమెరామెన్, డైరెక్టర్ తప్ప మరెవరూ అక్కడ లేకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తానికి అతి తక్కువ మంది సమక్షంలో,చాలా ప్రైవేట్‌గా ఈ లిప్ లాక్ సీన్‌ను షూట్ చేశాడట డైరెక్టర్ సందీప్ వంగా.ఇక ఆ సమయంలో ప్రభాస్ పడ్డ ‘ముద్దు’ కష్టాలు చూసి సెట్‌లో ఉన్న కొందరు నవ్వుకున్నారట కూడా. ఏది ఏమైనా ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ప్రభాస్, ఇలాంటి ఒక సీన్ కోసం కష్టపడ్డాడన్న వార్త  ఇప్పుడు ఇండస్ట్రీలో  హాట్ టాపిక్ అయిపొయింది.

వంగా మ్యాజిక్, ప్రభాస్ క్రేజ్ కలిస్తే థియేటర్లలో రచ్చ

అయితే  ఓ వైపు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపిస్తూనే, మరోవైపు ఇంతటి ఘాటు రొమాన్స్ చేయడం అనేది నిజంగా ఒక పెద్ద సాహసమే. ఇక ప్రభాస్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, కేవలం డైరెక్టర్ విజన్ కోసం ఈ సీన్ చేశారంటే, ఆ సీన్ సినిమాలో ఎంత స్పెషల్‌గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వంగా మ్యాజిక్, ప్రభాస్ క్రేజ్ కలిస్తే థియేటర్లలో రచ్చ మాములుగా ఉండదని పిక్స్ అయిపోతున్నారు రెబల్ ఫ్యాన్స్.చూస్తుంటే వంగా గత సినిమాల లాగే ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యాక ఈ లెంగ్తీ లిప్ లాక్ చుట్టూ పెద్ద డిస్కషన్ నడిచేలానే ఉంది.

సెట్‌లో సందీప్ వంగా ప్రత్యేక శ్రద్ధ

వచ్చే ఏడాది మార్చి 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్

ఇక సినిమా విషయానికి వస్తే  భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్, టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో  త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా కనిపించనుండగా వివేక్‌ ఒబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే  ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. చూడాలి మరి కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా తొలిసారి లెంగ్తీ లిప్ లాక్ సీన్‌ చేస్తున్న డార్లింగ్ స్పిరిట్ తో ఎన్ని వందల కోట్లు కొల్లగొడతాడో చూడాలి.

ప్రభాస్ ముద్దు సీన్ చేయడానికి పడిన కష్టాలు చూసి కొందరు నవ్వుకున్నారట. ఏది ఏమైనా ప్రభాస్ ఇలాంటి సీన్ కోసం కష్టపడడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.