|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ముందస్తు వేడుకలు షురూ! ప్రీమియర్ షోలపై నిర్మాత సంచలన ప్రకటన!

Published: 17-12-2025, 12:24 PM
ప్రభాస్ 'ది రాజాసాబ్' ముందస్తు వేడుకలు షురూ! ప్రీమియర్ షోలపై నిర్మాత సంచలన ప్రకటన!
  • ప్రభాస్ ‘ది రాజాసాబ్’ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
  • నిర్మాత విశ్వప్రసాద్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
  • సినిమా ప్రీమియర్ షోలు జనవరి 8 నుండి మొదలవుతాయని నిర్మాత స్పష్టం చేశారు.
  • మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో కనిపించనుండటం విశేషం.

ప్రభాస్ అభిమానులకు శుభవార్త! మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీమియర్ షోల గురించి నిర్మాత విశ్వప్రసాద్ కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రాజాసాబ్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్

The RajaSaab : మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజా సాబ్. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఆల్రెడీ విడుదలైపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను బయటకు తీస్తున్నాడు మారుతి.

ప్రభాస్ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. బాహుబలి సినిమా తర్వాత తన రేంజ్ మారిపోవడంతో ఎక్కువగా భారీ రేంజ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా స్ట్రాంగ్ కం బ్యాక్ అయింది. కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి దాదాపు 1000 కోట్ల పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం రాజా సాబ్ సినిమా రిలీజ్ కి సంబంధించి అన్ని పనులు మొదలైపోయాయి.

రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒక ఓపెన్ గ్రౌండ్లో ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రభాస్ ను అభిమానులంతా డైరెక్ట్ గా చూసి చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే కల్కి సినిమా తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ సినిమా ఒకటి కూడా రాలేదు.

ప్రీమియర్ షోల తేదీలపై స్పష్టత

ఇక రాజా సాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. అలానే ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు కూడా 8 వ తారీకు నుంచి మొదలుకానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ కూడా కొంతమేరకు ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా పైన ప్రభాస్ అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ అంచనాలు ఏవి కూడా అసలు తగ్గవు అని దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చేసాడు. ఇకపోతే మారుతి సక్సెస్ రేట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు తను చేసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోవచ్చు ఏమో కానీ డిజాస్టర్ అయితే కాలేదు.

మారుతి మార్కు ఎంటర్టైన్మెంట్

ఆడియన్స్ పల్స్ కరెక్ట్ గా తెలిసిన దర్శకుడు అని అల్లు అరవింద్ లాంటి నిర్మాతే మారుతిని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక రాజా సబ్ సినిమాతో ఒక బ్రాండ్ పాన్ ఇండియా ఇమేజ్ మారుతికి రానుందేమో చూడాలి.

ది రాజాసాబ్ ప్రీ రిలీజ్, ప్రీమియర్ షోల ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న ఈ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.