|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సెన్సార్ పూర్తి: రన్ టైమ్ ఎంతంటే షాకే!

Published: 23-12-2025, 3:44 AM
ప్రభాస్ 'ది రాజాసాబ్' సెన్సార్ పూర్తి: రన్ టైమ్ ఎంతంటే షాకే!
  • ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది.
  • సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది.
  • ‘ది రాజాసాబ్’ రన్ టైమ్ 183 నిమిషాలు (సుమారు 3 గంటల 3 నిమిషాలు) ఉండనుంది.
  • మాళవిక మోహన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీకి U/A సర్టిఫికెట్ వచ్చింది. 3 గంటలకు పైగా రన్ టైమ్‌తో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ది రాజాసాబ్: సెన్సార్ పూర్తి, U/A సర్టిఫికెట్

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 9వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ తరుణంలో U/A సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ది రాజా సాబ్ టైం కాస్త తగినట్లు తెలుస్తోంది.

ముందుగా మూడు గంటల 15 నిమిషాలు ఈ సినిమాను అనుకున్నారట. అయితే ట్రిమ్ చేయగా, ఈ సినిమా 183 నిమిషాల నిడివి మాత్రమే ఉండనుందట. అంటే దాదాపు మూడు గంటలకు పైగా మూవీ అన్నమాట. కాగా ప్రభాస్ నటించినది రాజా సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహన్, రిద్ది కుమార్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ మూవీలో ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది.

మూవీ నిడివిపై ఆసక్తికర చర్చ: 3 గంటలకు పైగా రన్ టైమ్!

ముగ్గురు హీరోయిన్లు, హారర్ కామెడీ నేపథ్యం

సెన్సార్ పూర్తి, భారీ రన్ టైమ్‌తో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. హారర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎలా చేరుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.