
📌 Key Points
- ది రాజసాబ్ మూవీ డిజాస్టర్ కావడంతో నిర్మాతకు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం!
- ప్రభాస్ చొరవతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్!
- టీజీ విశ్వప్రసాద్ తో ప్రభాస్ భేటీ.. సినిమా గురించి చర్చలు జరిగాయని సమాచారం.
- హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్న ప్రభాస్.. ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఒక సంచలన వార్త! ఆయన కేవలం ఫేమ్ లోనే కాదు వ్యక్తిత్వంలో కూడా గొప్ప వ్యక్తి అని మరోసారి రుజువైంది. ఆయన చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు.
రాజసాబ్ ఎఫెక్ట్: నిర్మాతకు భారీ నష్టం!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేమ్ లోనే కాదు వ్యక్తిత్వంలో కూడా చాలా గొప్ప వ్యక్తి అని చాలా మంది చెప్తూనే ఉంటారు. ఆ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది కూడా. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ప్రభాస్. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ది రాజసాబ్. హారర్ అండ్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల అయ్యింది.
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాల విషయంలో ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ ని కాదు కనీసం ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ను కూడా శాటిస్ఫై అవలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, సినిమా డిజాస్టర్ అవడంతో ఆయనకు భారీ నష్టాలు వచ్చాయని సమాచారం.
ప్రభాస్ బిగ్ ఆఫర్: మరో సినిమా ఛాన్స్!
ఆ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడట. ఇటీవల టీజీ విశ్వప్రసాద్ ప్రభాస్ ని కలువగా ఆయనతో ఈ మాట చెప్పాడట. దీంతో, నిర్మాత ఆనందం వ్యక్తం చేస్తున్నాడని సమాచారం. తన వల్ల నష్టపోయిన వారి కోసం నిలబడటం ప్రభాస్ కు ముందు నుంచి ఉన్న అలవాటే. ఇక ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చేయబోతున్న ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది అని తెలుస్తోంది.
త్వరలో ప్రకటన: డైరెక్టర్ ఎవరంటే?
అయితే, ఈ ప్రాజెక్టును ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, ఈసారి మాత్రం ప్రభాస్ రేంజ్ ని పాన్ ఇండియా లెవల్లో పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసే దర్శకుడు, ఆ రేంజ్ కథతోనే ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడట టీజీ విశ్వప్రసాద్. కాబట్టి, ఈసారి వీరి కాంబోలో రాబోయే మూవీ మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇక ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు హను రాభవపూడితో ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈఏడాది ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. త్వరలోనే అప్డేట్స్ అందిస్తాం!


