
📌 Key Points
- ప్రదీప్ రంగనాథ్ హీరోగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఏప్రిల్ 10న విడుదల కానుంది.
- ఈ సినిమాలో కృతి శెట్టి ‘ధీమా’ పాత్రలో స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే అమ్మాయిగా నటిస్తోంది.
- ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తూ, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ప్రేమకు అడ్డంకులు సృష్టిస్తారు.
- నయనతార నిర్మాణంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నయనతార నిర్మాణంలో విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.
‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ టీజర్ విడుదల
Lik Telugu Teaser: ప్రదీప్ రంగనాథ్ హీరోగా ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన త్వరలోనే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Lik) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ కు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.
ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. 2040వ సంవత్సరంలో ప్రేమ కథ ఎలా ఉంటుందో చూపించే నేపథ్యంలో ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ధీమా అనే పాత్రలో కృతి శెట్టి (Kriti Shetty)నటిస్తున్నారు. ఇన్స్టంట్ లవ్ కాకుండా స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే ధీమాకు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) పరిచయం అవుతారు. ఇలా వీరిద్దరూ మనసులు ఒకటవుతున్న తరుణంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్ జె సూర్య వీరి ప్రేమ కథకు అడ్డుపడతారు. ఇలా అడ్డంకులు ఎదురైనప్పటికీ వీరిద్దరి ప్రేమ కోసం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది అనే నేపథ్యంలోనే ఈ టీజర్ విడుదల చేశారు.
కృతి శెట్టి పాత్ర వివరాలు
ఈ టీజర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను కూడా పెంచేసింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్ జె సూర్య(S.J.Suriya) నటించబోతున్నట్టు స్పష్టమవుతుంది . నయనతార నిర్మాణంలో డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు, గౌరీ కిషన్ వంటి తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.
ప్రదీప్ రంగనాథ్ ఇటీవల డ్యూడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్ల కలెక్షన్లను కాబట్టి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఈయన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కీలక పాత్రలో నటించబోతున్నారు. తెలుగులో ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు ఈ నేపథ్యంలోని కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే కార్తి హీరోగా నటించిన అన్నగారు వస్తారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా సక్సెస్ ఇవ్వలేకపోయింది. మరి ప్రదీప్ రంగనాథన్ అయిన కృతి శెట్టికి సక్సెస్ ఇచ్చేనా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
విలన్ గా ఎస్.జె.సూర్య
ప్రదీప్ రంగనాథ్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ విడుదల కావడంతో సినిమా ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది.


