
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్యూడ్’ సినిమా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన గత చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తూ, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం దీపావళి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
Key Points
ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన.
‘లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రాల కంటే ‘డ్యూడ్’కు ఎక్కువ కలెక్షన్స్.
తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ‘డ్యూడ్’.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘డ్యూడ్’ దీపావళి బిగ్ విన్నర్‌గా నిలిచింది.
ప్రదీప్ రంగనాథన్ ఆనందం
‘‘డ్యూడ్’ సినిమాను అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మీరు అందిస్తున్న ప్రేమ మర్చిపోలేనిది. నేను హీరోగా నటించిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మించిన ఆదరణ, అభిమానం ‘డ్యూడ్’ సినిమాకి చూపిస్తున్నారు. నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని ప్రదీప్ రంగనాథన్ అన్నారు.
డ్యూడ్ కలెక్షన్స్ సునామీ
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా, ఆర్. శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
ఈ సందర్భంగా ‘డ్యూడ్ దివాళి బ్లాస్ట్’ పేరిట నిర్వహించిన సమావేశంలో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ– ‘‘తమిళనాడులోనూ నా గత చిత్రాలకంటే ‘డ్యూడ్’కు ఎక్కవ కలెక్షన్స్ వస్తున్నాయి’’ అని తెలిపారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి గత సినిమాలతో పోల్చుకుంటే కొన్ని ఏరియాల్లో నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’కు వస్తున్నాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ వచ్చింది. ‘డ్యూడ్’ దివాళి బిగ్ విన్నర్’’ అని ప్పారు. ‘‘జెన్ జి కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అని తెలి΄ారు వై. రవిశంకర్. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు.
ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు రికార్డు కలెక్షన్స్‌తో ఈ సినిమా ఒక పండుగ హిట్ చిత్రంగా నిలిచింది. చిత్రయూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది.


