|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pradeep Ranganathan : స్టేజిపై హీరోయిన్ బుగ్గలు గిల్లి, జుట్టు పట్టి లాగి.. హీరో చేసిన పనులు.. వీడియో వైరల్..

Published: 15-10-2025, 10:45 PM
Pradeep Ranganathan : స్టేజిపై హీరోయిన్ బుగ్గలు గిల్లి, జుట్టు పట్టి లాగి.. హీరో చేసిన పనులు.. వీడియో వైరల్..

డ్యూడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ప్రదీప్ రంగనాథన్ చేసిన పనులు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ మమితా బైజుతో కలిసి స్టేజిపై సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తూ, ఆయన ప్రవర్తించిన తీరుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

Key Points

1

డ్యూడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రదీప్ రంగనాథన్ వివాదాస్పద చర్యలు.

2

హీరోయిన్ మమితా బైజు బుగ్గలు గిల్లి, జుట్టు పట్టి లాగడం వంటి పనులు.

4

ప్రదీప్, మమితా చర్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన.

స్టేజిపై హీరో ప్రదీప్ రంగనాథన్ ఓవర్ యాక్షన్?

Pradeep Ranganathan : సినిమా హీరో, హీరోయిన్స్ ప్రమోషన్స్ కోసం సినిమా ఈవెంట్స్ లో తెగ కష్టపడుతుంటారు. ఇటీవల ప్రేక్షకులను మెప్పించడానికి స్టేజిపై రకరకాల విన్యాసాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ చేసిన పనులు వైరల్ గా మారాయి. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా తెరకెక్కిన డ్యూడ్ సినిమా రేపు అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.(Pradeep Ranganathan)

తాజాగా డ్యూడ్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో సరదాగా హీరో, హీరోయిన్స్ ని సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయమని అడిగారు. మొదట వద్దని చెప్పినా తర్వాత మమిత బైజు కూడా చెయ్యమని అనడంతో ప్రదీప్ రంగనాథన్.. మమిత బైజు బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకొని లాగి, వెనకాల మోకాలుతో కొట్టి, చేత్తో కొట్టడం చేసాడు. ఇద్దరూ కలిసి స్టేజిపై హంగామా చేసారు.

డ్యూడ్ సినిమా ప్రమోషన్స్‌లో వివాదం

Also See : Narne Nithin Wedding Photos : ఎన్టీఆర్ బామ్మర్ది.. నార్నె నితిన్ పెళ్లి ఫోటోలు చూశారా?

మొత్తానికి హీరో ఇలా స్టేజిపై హీరోయిన్ బుగ్గలు గిల్లడం, జుట్టు పట్టి లాగడం, కొట్టడం లాంటివి సరదాగా చేసినా ఇది నెగిటివ్ గా మారి వైరల్ అవుతుంది. కొంతమంది క్యూట్ అని అంటుంటే కొంతమంది మాత్రం స్టేజిపై ఇలా ప్రవర్తించడం ఏంటి అని అంటున్నారు. పైగా యాంకర్ అడిగింది సినిమాలోని కేవలం బుగ్గలు గిల్లే సీన్ చూపించి రీ క్రియేట్ చేయమంది. కానీ మిగిలింది అంతా వెళ్లే చేయడం గమనార్హం.

ప్రదీప్, మమితా బైజులపై నెగటివ్ కామెంట్స్

మొత్తంగా, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన ఈ పనులు ఆశించిన ప్రచారం తెచ్చినా, వివాదాలకు దారితీశాయి. సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి సంఘటనలు చిత్ర బృందానికి కలిసొస్తాయో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.