|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలో ప్రకాష్ రాజ్ కు షాక్? వైరల్ అవుతున్న సంచలన నిజాలు!

Published: 09-02-2026, 6:05 AM
ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో ప్రకాష్ రాజ్ కు షాక్? వైరల్ అవుతున్న సంచలన నిజాలు!
  • ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలో ప్రకాష్ రాజ్ లేరనే పుకార్లకు చెక్ పెట్టిన నటుడు
  • దర్శకుడితో గొడవ జరిగిందనే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పిన ప్రకాష్ రాజ్
  • 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘స్పిరిట్’ మూవీ
  • మహేష్ బాబు ‘వారణాసి’లోనూ కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటన

టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ. ఈ సినిమా గురించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వార్త ఏమిటో చూద్దాం!

‘స్పిరిట్’ నుండి ప్రకాష్ రాజ్ అవుట్?

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) తన నటనతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో, తన ముక్కుసూటి వ్యాఖ్యలతోనూ అంతే తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ప్రభాస్ (Prabhas)- సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ నుంచి ఆయనను తొలగించారనే వార్త నెట్టింట వైరల్ అయ్యింది. సెట్‌లో దర్శకుడితో గొడవ జరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ వస్తున్న పుకార్లపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘విషపూరితమైన నకిలీ వార్తలు ప్రచారం చేసే వారందరికీ.. స్పిరిట్ సినిమా గురించి ఒక మాట. ఆ సినిమాలో నా సన్నివేశాల చిత్రీకరణ ఇంకా మొదలే కాలేదు. అప్పుడే మీరు మీ వాట్సాప్ ఫ్యాక్టరీల ద్వారా లేనిపోని కథలు అల్లి ప్రచారం చేస్తున్నారు.

పెద్దవాళ్ళలా ప్రవర్తించండి, వెళ్లి మీ పని చూసుకోండి’’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. తన ట్రేడ్‌మార్క్ హ్యాష్ ట్యాగ్ #JustAsking తో ఈ పోస్ట్ ముగించడం విశేషం. షూటింగ్ ప్రారంభం కాకముందే ప్రకాష్ రాజ్ ఇలా క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. ఇక ‘స్పిరిట్’ మూవీ విషయానికొస్తే.. ఇందులో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రంతో పాటు ప్రకాష్ రాజ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

పుకార్లపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్!

2027లో ‘స్పిరిట్’ రిలీజ్!

ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఈ వివాదానికి తెరపడినట్టే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.