
📌 Key Points
- ప్రసాద్ బెహరా యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌తో పాపులర్ అయ్యారు.
- ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన మోసం గురించి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
- పనిమనిషి తనను మోసం చేసిందని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
- ప్రసాద్ బెహరా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో నటించారు, ప్రస్తుతం ‘పాపం ప్రతాప్’ సినిమాలో నటిస్తున్నారు.
ప్రసాద్ బెహరా తన జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటనను పంచుకున్నారు. ఒక అమ్మాయి తనను మోసం చేసిందని, దానివల్ల తాను ఎంతో నష్టపోయానని ఆయన కన్నీటితో చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రసాద్ బెహరా పాపులారిటీ
Prasad Behara : మీడియా ద్వారా ఎంతో మంది పాపులర్ అవుతారు అన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా చాలామంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ లేదా యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బాగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు.. ఇలా ఎంతోమంది తమ టాలెంట్ నిరూపించుకుంటూ సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం కమెడియన్లుగా సినిమాలు చేస్తున్న ఎంతోమంది అలానే ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్నారు.. అలాంటి కమెడీయన్లలో ప్రసాద్ బెహరా ఒకరు.. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన కామెడీతో ఫేమస్ అయిన ఇతను ఈ మధ్య వార్తలు ఎక్కువగా నిలుస్తున్నాడు.. తాజాగా ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
కమెడియన్ ప్రసాద్ బెహరా ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందులో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్న ప్రసాద్ ఒక అమ్మాయి వల్ల తన జీవితం నాశనం అయ్యింది అన్న విషయాన్ని కూడా బయటపెట్టారు. కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో నవ్వించే ప్రసాద్… ఈసారి మాత్రం తన జీవితంలోని నమ్మక ద్రోహాల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పనిమనిషిని కుటుంబ సభ్యురాలిలా చూసుకున్నా.. తనకి కావలసిన విధంగా అన్ని సమకూర్చాను.. కానీ నన్ను నిండా ముంచేసింది అని అతను ఎమోషనల్ అయ్యాడు.. జీవితంలో మరోసారి ఇలా మోసపోకూడదు అని అందరికీ హితబోధ చేశాడు. ఆ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజెన్లు ఇంకొకసారి అమ్మాయిలు వల్ల మోసపోకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మోసం గురించి ప్రసాద్ వెల్లడి
సినిమాల్లో ప్రసాద్ బెహరా
యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ లలో తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్వించాడు ప్రసాద్. టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదని నిరూపించుకున్న ప్రసాద్ సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంటూ వచ్చాడు. నిహారిక కొణిదల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు అనే చిత్రంలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ సినిమా మంచి టాక్ ని అందుకోవడంతో అతనికి అవకాశాలు కూడా వరుసగా వస్తున్నాయి. ఇక ప్రస్తుతం పాపం ప్రతాప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ మూవీ అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీతో ప్రసాద్ క్రేజ్ ఏ మాత్రం పెరుగుతుందో చూడాలి.. ఇకపోతే ప్రసాద్ యూట్యూబ్ వీడియోలను చేస్తూ బిజీగానే ఉంటున్నాడు. దీంతో పాటుగా ఆయనకు మరికొన్ని సినిమా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రసాద్ కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు..
ప్రసాద్ బెహరా తన జీవితంలో జరిగిన మోసం గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎవరికీ జరగకూడదని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు.


