
హాలీవుడ్ సైంటిఫిక్ హారర్ మూవీ ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ నవంబర్ 7న ఇండియాలో రిలీజ్ కానుంది. డాన్ ట్రాచెన్‌బర్గ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా ప్రెడేటర్ యూనివర్స్‌ను కొత్త కోణంలో చూపిస్తుంది.
Key Points
ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సైంటిఫిక్ హారర్ మూవీ నవంబర్ 7న ఇండియాలో రిలీజ్.
ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
డైరెక్టర్ డాన్ ట్రాచెన్‌బర్గ్ డీప్ స్టోరీ, యాట్జుజా కల్చర్‌ను చూపించారు.
డిమిట్రియస్ షస్టర్-కొలోమాటాంగీ, ఎల్లె ఫ్యానింగ్ జోడీ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
ఇండియాలో ప్రెడేటర్ బ్యాడ్‌లాండ్స్ రిలీజ్
హాలీవుడ్ సైంటిఫిక్ హారర్ మూవీ ఇండియన్ అభిమానులను అలరించేందుకు వస్తోంది . డాన్ ట్రాచెన్‌బర్గ్ ( Dan Trachtenberg ) దర్శకత్వం వహించిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ ( Predator: Badlands ) ఇండియాలో రిలీజ్ కు సిద్ధమైంది . హాలీవుడ్ లో సత్తాచాటిన ఈ సినిమా నవంబర్ 7 న మన థియేటర్లలో సందడి చేయనుంది . ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది .
దర్శకుడు ట్రాచెన్‌బర్గ్ ఈసారి ప్రెడేటర్ యూనివర్స్‌ను మునుపెన్నడూ లేని విధంగా తెరకెక్కించారు. కేవలం సర్వైవల్ గేమ్‌కు పరిమితం కాకుండా .. ప్రెడేటర్ హంట్ వెనుక ఉన్న లెజెండ్, యాట్జుజా కల్చర్, కోడ్ ఆఫ్ హానర్ లాంటి లోతైన కథాంశాలను డీల్ చేయడం ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతిని ఇస్తోంది. అంతేకాకుండా డిమిట్రియస్ షస్టర్-కొలోమాటాంగీ , ఎల్లె ఫ్యానింగ్ జోడీ కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది . ఏలియన్ హంట్ ఉద్రిక్తత మధ్యలో కూడా వారి మధ్య కనిపించే మానవత్వం, ఫ్రెండ్‌షిప్, హ్యూమర్ సినిమాకు సరికొత్త ఫీల్ తెచ్చేలా కనిపిస్తోంది. డాన్ ట్రాచెన్‌బర్గ్ సృష్టించిన ఈ ఎమోషనల్ అడ్వెంచర్ హంట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలంటే నవంబర్ 7 వరకు వేచి చూడాల్సిందే.
ప్రెడేటర్ యూనివర్స్ కొత్త కోణం
నటీనటుల కెమిస్ట్రీ, మానవత్వం
ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ కేవలం హంట్ మూవీ కాదు, డీప్ స్టోరీతో ఎమోషనల్ అడ్వెంచర్‌ను అందిస్తుంది. నవంబర్ 7న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.


