|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్‌ వేరే లెవెల్‌

Published: 06-06-2025, 6:57 PM
ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్‌ వేరే లెవెల్‌

ప్రియదర్శి నటించిన కొత్త సినిమా ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్ విడుదలైంది. స్నేహం ప్రధానంగా సాగే ఈ కథలో ప్రియదర్శితో పాటు రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, మరియు సోషల్ మీడియా స్టార్ నిహారిక కనిపించనున్నారు.

Key Points

1

ప్రియదర్శి నటనతో మిత్ర మండలి సినిమా ఆకట్టుకుంటుంది.

2

నలుగురు స్నేహితుల మధ్య సాగే రచ్చ ఈ సినిమాలో ప్రధానం.

4

బన్నీ వాసు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అంచనాలను పెంచుతోంది.

మిత్ర మండలి ఫస్ట్ లుక్ విడుదల

నటుడు ప్రియదర్శి కంటెంట్‌ ఉన్న చిత్రాలతో అలరిస్తున్నాడు. `పెళ్లిచూపులు` నుంచి అదే పంథాని ఫాలో అవుతున్నాడు.  ఇటీవల `కోర్ట్`లో లాయర్‌గా అదరగొట్టాడు. అలాగే `సారంగపాణి`లోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు.

ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. తాజాగా `మిత్రమండలి` పేరుతో సినిమా చేస్తున్నాడు. తన `మిత్ర మండలి`తో ఆయన ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాడు.

స్నేహం ప్రధానంగా సాగే మూవీ ఇది. నలుగురు స్నేహితులు కలిసి చేసే రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూడొచ్చు అంటోంది టీమ్‌. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సమర్పణలో ఈ మూవీ తెరకెక్కుతుండటం విశేషం.

ప్రియదర్శి కొత్త సినిమా

ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ప్రీ లుక్ కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ముసుగు అవతారాలలో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగింది.  తాజాగా శుక్రవారం ఈ చిత్ర టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు.

ఈ చిత్రానికి “మిత్ర మండలి” అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తోపాటు, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్ ను పరిచయం చేసింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం “మిత్ర మండలి” చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం. సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ కోసం టామ్ క్రూజ్‌తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచారు.

నిహారిక తెలుగు అరంగేట్రం

అద్భుతమైన నటన, కామిక్ టైమింగ్, భిన్నమైన పాత్రల ఎంపికతో ప్రియదర్శి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు ‘మ్యాడ్’ ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి ప్రతిభగల నటులు తోడయ్యారు. ఈ నలుగురు కలిసి ‘మిత్ర మండలి’తో రచ్చ చేయబోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

బన్నీ వాస్ తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై ‘మిత్ర మండలి’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు.

నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. `’మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుందని, మ్యాడ్‌ నెస్‌ ఇప్పుడే మొదలైందని టీమ్‌ తెలిపింది.

ప్రియదర్శి, నిహారిక, మరియు ఇతర ప్రతిభావంతులైన నటులతో కూడిన ‘మిత్ర మండలి’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. స్నేహం, కామెడీతో కూడిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.