|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Priyadarshi: నేనేం తప్పు చేశాను.. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఒకే ఐపీ అడ్రెస్స్ పై 300 ఫేక్ ఐడీలు..

Published: 15-10-2025, 9:11 AM
Priyadarshi: నేనేం తప్పు చేశాను.. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఒకే ఐపీ అడ్రెస్స్ పై 300 ఫేక్ ఐడీలు..

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఐపీ అడ్రెస్ నుండి 300 ఫేక్ ఐడీలతో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని ఆయన షాకింగ్ విషయాలు వెల్లడించారు. “మిత్ర మండలి” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

నటుడు ప్రియదర్శిని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్‌తో టార్గెట్ చేస్తున్నారు.

2

ఒకే ఐపీ అడ్రెస్ నుండి 300 ఫేక్ ఐడీలు సృష్టించి ట్రోల్ చేస్తున్నారని ఆవేదన.

4

తాను తప్పు చేస్తే విమర్శించవచ్చు, కానీ ఇలా చేయడం సరికాదని ప్రియదర్శి వ్యాఖ్య.

ప్రియదర్శి ఆవేదన: సోషల్ మీడియా టార్గెటింగ్

Priyadarshi: తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priyadarshi). ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మిత్ర మండలి. దర్శకుడు విజేందర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సోషల్ మీడియాలో నిహారిక యెన్ఏం హీరోయిన్ గా నటిస్తుండగా.. బ్రహ్మానందం, రాగ్ మయూర్, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేష్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విడుదల కానుంది ఈ సినిమా.

ఒకే ఐపీ నుండి 300 ఫేక్ ఐడీలు

Ram Pothineni: హీరోయిన్స్ తో ఆడుకుంటున్నావ్.. కాదు, వెంటతిప్పుకున్నాను.. ప్రేమకథ చెప్పిన హీరో రామ్

“మిత్ర మండలి” ప్రమోషన్స్‌లో షాకింగ్ నిజాలు

అయితే, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్ చేశారు. మిత్ర మండలి సినిమా ట్రైలర్ రిలీజ్ టైంలో తనకు ఎదురైనా చేదు సంఘటన గురించి వివరించాడు. “మిత్ర మండలి సినిమా ట్రైలర్ విడులయ్యాక చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నిజానికి ఇంతకుముందు ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. ఒకే ఐపీ అడ్రస్ నుంచి 300 ఫేక్ ఐడీలతో కామెంట్స్ పెట్టించారు. ఇది తెలిసి నిజంగా షాకయ్యాను. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. నేను ఏదైనా తప్పు చేస్తే విమర్శించవచ్చు. కానీ ఇలా చేయడం కరక్ట్ కాదు. కేవలం ఇది నా సినిమా అని ఇలా చేస్తున్నారా, లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో తెలియదు” అంటూ చెప్పుకొచ్చాడు ప్రియదర్శి. దీంతో, ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రియదర్శి చేసిన ఈ సంచలన ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ సంఘటనపై స్పందిస్తున్నారు. ఇలాంటి చర్యలు సినీ పరిశ్రమకు మంచివి కావని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.