
📌 Key Points
- ప్రియాంక చోప్రా: మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా రీఎంట్రీతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
- బాలీవుడ్‌లో రాజకీయాల కారణంగా హాలీవుడ్ బాట పట్టిన ప్రియాంక.. సంచలన విషయాలు వెల్లడి!
- హాలీవుడ్‌లో ‘ది బ్లఫ్’ మూవీతో ఫిబ్రవరి 25న ప్రియాంక సందడి.. భారీ యాక్షన్ సీక్వెన్స్!
- 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాలో ప్రియాంక.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర చర్చలు!
హాలీవుడ్‌లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా మళ్ళీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది! మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. బాలీవుడ్‌లో ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి సంచలన విషయాలు వెల్లడించింది.
రాజమౌళి సినిమాలో ప్రియాంక రీఎంట్రీ!
Priyanka Chopra : ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. కానీ మహేష్ – రాజమౌళి వారణాసి సినిమాతో మళ్ళీ ఇండియన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత హాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా స్టార్ అయింది.(Priyanka Chopra)
ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ది బ్లఫ్’ ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ లో రాజకీయాలు.. షాకింగ్ విషయాలు!
ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. నేను బాలీవుడ్ ని వదిలేసి వెళ్లాలని అసలు అనుకోలేదు. కానీ అప్పట్లో బాలీవుడ్ లో నాపై రాజకీయాలు చేసారు. నన్ను పక్కనపెట్టేశారు. నాకు రావాల్సిన అవకాశాలను రాకుండా అచేసారు. నాకు సినిమాలు చేయాలి, ఇంకా ఎదగాలి అని ఉన్నా అక్కడ నాకు పరిస్థితులు సహకరించలేదు. అలాంటి సమయంలో హాలీవుడ్ నుంచి వచ్చిన ఓ ఆఫర్ ని అందుకొని ఇక్కడ ప్రయాణం మొదలుపెట్టాను అని తెలిపింది.
హాలీవుడ్ లో ప్రియాంక ‘ది బ్లఫ్’ మూవీ!
ప్రియాంక హాలీవుడ్ కి వెళ్ళేసరికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలతో నటించింది. స్టార్ హీరోయిన్ అయినా ఆమెపై రాజకీయాలు చేసారంటే ఇక కొత్తవాళ్ళ సంగతి ఏంటి అని షాక్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వారణాసి సినిమాతో మళ్ళీ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తుంది ప్రియాంక. మరి ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇండియన్ సినిమాలు చేస్తుందా లేదా చూడాలి.
ప్రియాంక చోప్రా రీఎంట్రీ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి. అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం!


