
ముంబైలో జరిగిన బుల్గారి ఈవెంట్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను చూసి నటి మృణాల్ ఠాకూర్ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రియాంకను హగ్ చేసుకుని ఐ లవ్యూ అని చెప్పింది. అదే ఈవెంట్‌లో తమన్నా డ్యాన్స్‌ను ప్రియాంక మెచ్చుకుంది. ఈ ఆసక్తికర సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Key Points
ప్రియాంక చోప్రాను చూసి మృణాల్ ఠాకూర్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది.
తమన్నా డ్యాన్స్‌ను ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా ప్రశంసించింది.
బుల్గారి స్టోర్ ప్రారంభోత్సవానికి ప్రియాంక అమెరికా నుండి వచ్చింది.
సమంత, కీర్తి సురేష్, త్రిప్తి డిమ్రి వంటి తారలు కూడా హాజరయ్యారు.
మృణాల్ ఠాకూర్ కన్నీళ్లు.. ప్రియాంక చోప్రా స్పందన
హిందీ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లి గ్లోబల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా . అయితే, ఇటీవల అక్టోబర్ 1న సాయంత్రం ముంబైలో జరిగిన బుల్గారి స్టోర్ ప్రారంభోత్సవానికి ప్రియాంక చోప్రా హాజరైంది. ఈ ఈవెంట్ కోసం అమెరికా నుంచి ఇండియాకు విచ్చేసింది ఈ గ్లోబల్ బ్యూటీ.
అయితే, ఇదే ఈవెంట్‌కు సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా హాజరైంది. ఇతర సెలబ్రిటీలతో ప్రియాంక చోప్రా మాట్లాడుతుండగా మృణాల్ ఠాకూర్ గ్లోబల్ స్టార్‌ను చూసింది. ప్రియాంక చోప్రాను చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది మృణాల్ ఠాకూర్.
ప్రియాంక చోప్రాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది మృణాల్ ఠాకూర్. అలాగే, ప్రియాంక చోప్రాను హగ్ చేసుకుని ఐ లవ్యూ అని చెప్పింది మృణాల్. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందులో మృణాల్ ఎమోషనల్ అవడం, ప్రియాంకకు ఐ లవ్యూ చెప్పడం చూడొచ్చు.
తమన్నా డ్యాన్స్‌పై ప్రియాంక ప్రశంసలు
ఇదిలా ఉంటే, ఈ ఈవెంట్‌కు హాజరైన మృణాల్ స్ట్రాప్‌లెస్ బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో అందంగా కనిపించింది. ఇక ప్రియాంక చోప్రా సొగసైన వైట్ దుస్తుల్లో అట్రాక్టివ్‌గా మెరిసింది. అనంతరం తమన్నాను చూసిన ప్రియాంక చోప్రా పలకరించిన ఆప్యాయంగా కౌగిలించుకుంది.
ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా నటనను తమన్నా ప్రశంసించింది. దీనిపై ప్రియాంక చోప్రా స్పందిస్తూ, “నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు చాలా అద్భుతమైన డ్యాన్సర్” అని తమన్నా డ్యాన్స్‌లో తనకు నచ్చిన విషయాలను పంచుకుంది. ఈ ఈవెంట్‌లో త్రిప్తి డిమ్రి , కీర్తి సురేష్ , సమంత రూత్ ప్రభు కూడా పాల్గొన్నారు.
మరుసటి ఉదయం, ప్రియాంక చోప్రా ముంబై విమానాశ్రయంలో కనిపించింది. డెనిమ్‌లో సాధారణ దుస్తులు ధరించిన ప్రియాంక చోప్రా చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఫొటోగ్రాఫర్లకు అభివాదం చేసింది. “చల్తే హై ఫిర్ అబ్ (మళ్లీ కలుద్దాం)” అంటూ ప్రియాంక చోప్రా వెళ్లిపోయింది.
ఇతర సెలబ్రిటీలు, రాబోయే సినిమాలు
కాగా, ప్రియాంక చోప్రా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు తో SSMB29లో నటించనుంది. ఈ సినిమాను దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ది బ్లఫ్ చిత్రంలో 19వ శతాబ్దపు కరీబియన్ పైరేట్‌గా కనిపించనుంది ప్రియాంక.
మరోవైపు మృణాల్ ఠాకూర్ చివరిగా అజయ్ దేవగన్ సరసన సన్ ఆఫ్ సర్దార్ 2లో కనిపించింది. ఇది ఇటీవల థియేట్రికల్ రన్ ముగించుకుని ఇప్పుడు సన్నాఫ్ సర్దార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రియాంక చోప్రాను చూసి మృణాల్ ఎమోషనల్ అవ్వడం, తమన్నాను ఆమె ప్రశంసించడం ఈ ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది. పలువురు తారల సందడి, రాబోయే ప్రాజెక్టులతో ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


