|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలీవుడ్ పై ప్రియాంక సంచలన కామెంట్స్! అందుకే అక్కడ సినిమాలు చేయలేదట! షాకింగ్ రీజన్స్ వైరల్!

Published: 23-02-2026, 2:35 AM
బాలీవుడ్ పై ప్రియాంక సంచలన కామెంట్స్! అందుకే అక్కడ సినిమాలు చేయలేదట! షాకింగ్ రీజన్స్ వైరల్!
  • బాలీవుడ్ ను వదిలి హాలీవుడ్ బాట పట్టిన ప్రియాంక చోప్రా సంచలన నిర్ణయం!
  • హాలీవుడ్ లో వరుస సినిమాలు, బిజీ లైఫ్ గడుపుతున్న ప్రియాంక.
  • ఇండియన్ సినిమాలపై మక్కువతో ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్న ప్రియాంక.
  • బాలీవుడ్ లో అవకాశాలు తగ్గడం వల్లే హాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యానన్న ప్రియాంక

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన సత్తా చాటిన ఈ అమ్మడు తాజాగా కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ ను వదిలిన ప్రియాంక.. కారణం ఇదేనా?

Priyanka Chopra; స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినిమాల గురించి అవగాహన ఉన్న ప్రతీఒక్కరికీ ఈ అమ్మడు గురించి పరిచయం అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కి ఎదిగింగి. ప్రస్తుతం అక్కడే సెటిల్ అయిన ప్రియాంక అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

హాలీవుడ్ లో ప్రియాంక.. ఫుల్ బిజీగా కెరీర్!

అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక(Priyanka Chopra) తాను బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేయడానికి గల కారణాలను వివరించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..’నేను కావాలని బాలీవుడ్ ని వదిలేయలేదు. అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్నా కానీ, ఎందుకో ఒక పరిమితి దగ్గర ఆగిపోయాను అని అనిపించింది. నా మార్కెట్ ని విస్తరించుకునే అవకాశం దొరకడం లేదు అని ఫీలయ్యాను. అందుకే, హాలీవుడ్ లో సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయ్యాను.

ఇండియన్ సినిమాలపై ఇష్టం.. మళ్ళీ రీఎంట్రీ!

అదే సమయంలో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడు కాస్త ఒత్తిడికి గురయ్యాను. ఫైనల్ గా హాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇక్కడికి పూర్తిగా షిఫ్ట్ అయ్యాను. కానీ, నాకు ఎప్పటికీ ఇండియన్ సినిమాల్లో నటించడమంటేనే ఇష్టం. అందుకే, ఇప్పుడు ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆమె బాలీవుడ్ కు దూరం కావడానికి గల కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.