|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖిల్ ‘లెనిన్’పై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు: “హడావిడి కాదు, కంటెంటే ముఖ్యం!”

Published: 04-01-2026, 4:30 AM
అఖిల్ 'లెనిన్'పై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు: "హడావిడి కాదు, కంటెంటే ముఖ్యం!"
  • అఖిల్ కెరీర్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మాత్రమే ఒక మోస్తరు ఫలితాన్ని ఇచ్చింది.
  • అఖిల్ తదుపరి చిత్రం ‘లెనిన్’కు నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
  • “హడావిడి వద్దు, కంటెంటే మాట్లాడాలి” అని అఖిల్ సూచించినట్లు నాగవంశీ వెల్లడించారు.
  • ‘లెనిన్’ షూటింగ్ 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది; వేసవిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

అక్కినేని అఖిల్ కెరీర్ అయోమయంలో ఉన్న వేళ, ఆయన రాబోయే చిత్రం ‘లెనిన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నిర్మాత నాగవంశీ ఇటీవల అఖిల్, ‘లెనిన్’ ప్రమోషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హడావిడి వద్దు, కంటెంటే మాట్లాడాలి’ అన్న అఖిల్ సూచనను ఆయన బయటపెట్టారు.

అఖిల్ కెరీర్, ‘లెనిన్’ ప్రాధాన్యత

Naga Vamshi About Lenin: అక్కినేని కుటుంబ వారసుల్లో .. ప్రస్తుతం అఖిల్ అక్కినేని పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవైపు నాగార్జున పెద్ద కుమారుడు.. నాగచైతన్య.. కొన్ని హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుండగా.. మరోవైపు అఖిల్ మాత్రం వరుస ఫ్లాపులతో కాస్త వెనుకబడ్డారు. అఖిల్ కెరీర్‌లో ఇప్పటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే ఒక మోస్తరు ఫలితాన్ని ఇచ్చింది. మిగతా సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన ఏజెంట్ సినిమా ఫ్లాపులకే.. బాబుగా నిలిచింది.

ఈ పరిస్థితుల్లో తండ్రిగా నాగార్జున.. అఖిల్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అఖిల్ రాబోయే సినిమా లెనిన్ విషయంలో నాగార్జున జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు నిర్మాత అయిన నాగ వంశి.. చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అఖిల్ లెనిన్ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగవంశీ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం పెద్ది, డకోయిట్, టాక్సిక్ సినిమాల విడుదల తేదీల్లో మార్పులు జరుగుతున్నాయని, అందువల్ల కొంత కన్ఫ్యూషన్ ఉందని చెప్పారు. అన్ని తేదీలు క్లియర్ అయిన తర్వాత.. ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.

నాగవంశీ కీలక వ్యాఖ్యలు: హడావిడి ఎందుకు లేదు?

అలాగే ఈ సినిమాకు ఇప్పటివరకు పెద్దగా ప్రమోషన్స్ ఎందుకు చేయడం లేదని అడిగితే.. నాగవంశీ ఆసక్తికరమైన విషయం చెప్పారు. జనవరి 5న ఒకసారి విడుదల చేయాలి అనుకుంటున్నామని తెలిపాడు. అయితే అఖిల్ “కంటెంటే మాట్లాడాలి, హడావిడి అవసరం లేదు” అని ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పారని వివరించారు. అందుకే లెనిన్ షూటింగ్‌ను కూడా చాలా సైలెంట్‌గా పూర్తి చేస్తున్నామని అన్నారు. ఇక షూటింగ్ 20 రోజులు మాత్రమే ఉంది అని కూడా తెలిపాడు. అలానే ఈ చిత్రం నుంచి చిన్నగా ప్రమోషన్ కంటెంట్ విడుదల చేసిన ప్రతి ఒక్కటి పేలుతుంది అన్న నమ్మకం మాత్రం ఉంది అని చెప్పారు.

ఇంకా యాంకర్.. అఖిల్‌కి టాలెంట్ ఉన్నా హిట్లు ఎందుకు రావట్లేదని ప్రశ్నించగా.. దానికి స్పష్టంగా సమాధానం చెప్పడం కష్టం అని నాగవంశీ అన్నారు. తాను మొదట అఖిల్‌ను వివి వినాయక్.. దర్శకత్వంలో లాంచ్ చేయాలనుకున్నానని..కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని చెప్పారు. ఇప్పుడు లెనిన్ కథ చెప్పగానే నాగార్జునకు నచ్చిందని..అందుకే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లిందని తెలిపారు.

విడుదల తేదీ, ప్రమోషన్స్ ప్లాన్

మొత్తానికి, అఖిల్ కెరీర్‌కు లెనిన్ చాలా కీలకమైన సినిమా అని..ఈసారి హడావిడి కన్నా కథ..నటనే ఆయుధంగా మారబోతున్నాయని నాగ వంశీ తేల్చి చెప్పేశారు.

మొత్తానికి ‘లెనిన్’ సినిమాతో అఖిల్ కెరీర్‌కు మలుపు తిప్పాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కంటెంట్ పైనే పూర్తి నమ్మకంతో, అనవసరపు హడావిడి లేకుండా ప్రేక్షకుల ముందుకు రావాలని నాగవంశీ బృందం ఆశిస్తోంది. వేసవిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.