|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘హే భగవాన్’ వెనుక అసలు కథ! నిర్మాత నరేంద్ర రెడ్డి సంచలన విషయాలు!

Published: 13-02-2026, 10:05 AM
‘హే భగవాన్’ వెనుక అసలు కథ! నిర్మాత నరేంద్ర రెడ్డి సంచలన విషయాలు!
  • నిర్మాత బి. నరేంద్ర రెడ్డి ‘హే భగవాన్’ సినిమా కోసం 10 కథలు విన్నాక దీనిని ఎంచుకున్నారు.
  • సుహాస్, శివానీ నగరం, నరేష్, స్రవంతి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.
  • ఫిబ్రవరి 20న వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
  • తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుందని నిర్మాత తెలిపారు.

నిర్మాత బి. నరేంద్ర రెడ్డి తన కొత్త చిత్రం ‘హే భగవాన్’ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాను ఎంచుకోవడానికి ముందు ఆయన దాదాపు పది కథలు విన్నారట. సుహాస్, శివానీ నగరం ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

నిర్మాతగా మారడానికి కారణం ఏమిటి?

Hey Bhagavan: ‘హే భగవాన్’ కంటే ముందు పది కథలు విన్నాను. కానీ ఏది నచ్చలేదని అన్నారు నిర్మాత బి. నరేంద్ర రెడ్డి. సుహాస్ (Suhas), శివానీ నగరం (Shivani Nagaram), సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘హే భగవాన్’ (Hey Bhagavan). గోపీ అచ్చర (Gopi Achara) దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి (B Narendra Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 20న నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాస్‌.. ఈ ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత బి. నరేంద్ర రెడ్డి మీడియాకు ఈ సినిమాకు సంబంధించిన విషయాలను తెలిపారు.

‘హే భగవాన్’ కథ ఎలా నచ్చింది?

కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన నేను, ప్రస్తుతం బెంగుళూరులో కన్‌స్ట్రక్షన్‌ రంగంలో ఉన్నాను. చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కన్నడలో నిర్మాతగా ప్రవేశించాను. తెలుగులో నిర్మాతగా నా తొలి సినిమా ‘హే భగవాన్‌’. కన్నడ సినీ పరిశ్రమలో సినిమాలకు ఫైనాన్స్‌ ఇచ్చేవాడిని. అలా నాకు కూడా సినిమాలపై ప్యాషన్ ఏర్పడింది. ఆ ప్యాషన్‌తో నిర్మాతగా మారాను. మా సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత రమణా రెడ్డి ఈ కథ గురించి చెప్పారు. ‘హే భగవాన్‌’ కంటే ముందు దాదాపు పది కథల వరకు విన్నాను. కానీ ఏదీ నాకు నచ్చలేదు. ఈ కథ వినగానే ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్‌గా ఉండే కథ కావడంతో.. ఈ సినిమాతోనే నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాను.

సినిమా గురించి నిర్మాత ఏమన్నారు?

స్టోరీ నచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాను. మొదట అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా మొత్తం పూర్తయింది. ప్రతీది ప్లానింగ్‌ ప్రకారమే జరిగింది. సినిమాకు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. అంత క్వాలిటీగా అవుట్‌పుట్‌ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఫాదర్‌ అండ్ సన్‌ ఎమోషన్‌ అందరి హృదయాలను తాకుతుంది. సినిమా కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్‌ అయ్యానో.. రేపు సినిమా విడుదల తర్వాత ఆడియన్స్‌ కూడా అదే థ్రిల్ ఫీలవుతారు. ప్రతి సన్నివేశం ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా, ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో హీరో సుహాస్‌, నటుడు నరేష్‌, కమెడియన్ సుదర్శన్‌, వెన్నెల కిషోర్‌ ఇలా ప్రతి పాత్ర ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరి ఊహకు అందని విధంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉంటుంది. బన్నీ వాస్‌, వంశీ అసోసియేషన్‌తో ఈ సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది. మా బ్యానర్‌లో తదుపరి ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో ఓ సినిమా ఉంటుంది. సత్యదేవ్‌ హీరో. లక్ష్మీనారాయణ దర్శకుడు. అవుట్‌ అవుట్‌ అండ్‌ కమర్షియల్ మూవీ ఇది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌ నటిస్తారు’’ అని నిర్మాత బి. నరేంద్ర రెడ్డి చెప్పుకొచ్చారు.

చివరిగా, ‘హే భగవాన్’ సినిమా ఒక మంచి ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులు కూడా సినిమా చూసిన తర్వాత అదే అనుభూతి పొందుతారని నిర్మాత నరేంద్ర రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తండ్రీ కొడుకుల ఎమోషన్ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.