|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Producer SKN : మరోసారి నిర్మాత SKN పెద్ద మనసు.. ఆ నటి తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో..

Published: 08-09-2025, 4:15 AM
Producer SKN : మరోసారి నిర్మాత SKN పెద్ద మనసు.. ఆ నటి తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో..

తెలుగు సినిమా నిర్మాత SKN తన వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సమాజ సేవకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. తాజాగా నటి రేఖ భోజ్ తండ్రికి ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థిక సహాయం చేశారు.

Key Points

1

నిర్మాత SKN నటి రేఖ భోజ్ తండ్రికి ఆర్థిక సహాయం చేశారు.

2

రేఖ భోజ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి కష్టంగా ఉండటంతో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

4

SKN ఈ సహాయాన్ని రహస్యంగా ఉంచుకున్నారు.

నటి రేఖ భోజ్ తండ్రి ఆరోగ్య సమస్యలు

Producer SKN : నిర్మాత SKN వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తూ బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. గతంలో సోషల్ మీడియా ద్వారానే అనేక మందికి హెల్ప్ చేసారు. జనసేన పార్టీ తరపున కూడా కొంతమందికి సపోర్ట్ చేసారు. తాజాగా నిర్మాత నిర్మాత SKN మరో సాయం చేసారు. అయితే ఈ సాయాన్ని నిర్మాత SKN బయటకు చెప్పుకోలేదు.

పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, ఇండిపెండెంట్ సినిమాలు, ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నటి రేఖ భోజ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రేఖ. కొన్ని రోజుల క్రితం రేఖ భోజ్ తన తండ్రికి హెల్త్ బాగోలేదని, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ నిర్మాత SKN చూడటంతో ఆమె తండ్రి ఆరోగ్యం కోసం ఆర్ధిక సహాయం చేసారు.

నిర్మాత SKN సహాయం

అయితే ఇది ప్రచారం చేసుకోవడం ఇష్టం లేక ఎవ్వరికి చెప్పుకోలేదు, తాను కూడా పోస్ట్ చేయలేదు నిర్మాత SKN. అయితే నటి రేఖ భోజ్ మాత్రం నిర్మాత SKN పేరు చెప్పకుండా.. మా నాన్నగారికి సర్జరీ అన్న పోస్ట్ చూసి, పరిచయం లేకున్నా, అడగకుండానే ఒక తెలుగు ప్రొడ్యూసర్ గారు పెద్ద సహాయాన్ని అందించారు. మీ హెల్ప్ నాకు చాలా చాలా విలువైనది సార్. చాలా థాంక్స్ అండి అంటూ కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసింది. తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఆ సహాయం నిర్మాత SKN చేసారని తెలిసింది దీంతో మరోసారి ఆయన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

రేఖ భోజ్ కృతజ్ఞతలు

నిర్మాత SKN చేసిన మానవతా సేవకు నెటిజన్లు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రహస్యంగా సహాయం చేసిన SKN మంచితనం అందరినీ ఆకట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.