|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా ఫ్యామిలీపై కుట్ర? ‘పెద్ది’ ఆపితే ఆమరణ దీక్షకు దిగుతా అంటున్న నిర్మాత!

Published: 23-05-2026, 4:45 PM
మెగా ఫ్యామిలీపై కుట్ర? 'పెద్ది' ఆపితే ఆమరణ దీక్షకు దిగుతా అంటున్న నిర్మాత!
  • ‘పెద్ది’ సినిమా తెలంగాణలో పర్సంటేజ్ వివాదంతో విడుదల డైలమాలో పడింది.
  • ఎగ్జిబిటర్లు టికెట్ రేట్లు పెంచవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
  • బండ్ల గణేష్ పరిశ్రమ క్షేమం కోసం ‘పెద్ది’ విజయం అవసరమని అభిప్రాయపడ్డారు.
  • నట్టికుమార్ మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమరణ దీక్షకు హెచ్చరించారు.

‘పెద్ది’ సినిమా విడుదలపై తెలంగాణలో నెలకొన్న వివాదం తీవ్ర రూపం దాల్చింది. చిరంజీవి కుటుంబాన్ని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. సినిమాను ఆపితే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించడం సంచలనం రేపింది.

పెద్ది సినిమా విడుదలపై ఉత్కంఠ

Peddi Controversy: పెద్ది సినిమా ఒకవైపు ప్రమోషన్లతో హోరెత్తిస్తుంటే మరో వైపు పర్సంటేజ్ పంచాయితీ సినిమా రిలీజ్ ని డైలమాలో  పడేస్తుంది. విషయంలోకి వెళ్తే పెద్ది జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. ఆంధ్రాలో ఈ చిత్రం విడుదలకు ఎలాంటి లైన్ క్లియర్ అయినప్పటికీ, తెలంగాణ (నైజాం) లో మాత్రం సినిమా రీలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్స్ పెరిగిపోతున్నాయ్.

నైజాం ప్రాంతంలో పర్సంటేజీ ప్రకారమే సినిమాలను ప్రదర్శించాలంటూ ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండటంతో ‘పెద్ది’ సినిమా విడుదల డైలమాలో పడింది.ఈ వివాదం శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ఎగ్జిబిటర్ల ప్రెస్‌మీట్‌తో మరో మలుపు తిరిగింది. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచే అవకాశం ఇవ్వకూడదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఎగ్జిబిటర్ల సంఘం లేఖ రాయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌  స్పందిస్తూ

ఇలాంటి సమయంలో నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ ఎక్స్ వేదికగా స్పందిస్తూ పరిశ్రమ క్షేమం కోరి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను ప్రస్తావిస్తూ, థియేటర్ల భవిష్యత్తు కోసం, సినిమాపైనే ఆధారపడి బతుకుతున్న వేలాది కార్మిక కుటుంబాల కోసం ‘పెద్ది’ చిత్రం అఖండ విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాక్సాఫీస్ వద్ద ఉన్న సమస్యలని అధిగమించడానికి పరిశ్రమలోని పెద్దలంతా విభేదాలు, వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను పక్కనపెట్టి ఏకం కావాలని బండ్ల గణేశ్ విజ్ఞప్తి చేశారు.

చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారా?

ఒక పెద్ద సినిమా బ్లాక్‌బస్టర్ అయితేనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో మళ్లీ నమ్మకం పుడుతుందని, ‘పెద్ది’ రిలీజ్ వరకైనా ఎవరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. సినిమా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని, తద్వారా వేలాది కుటుంబాలు సురక్షితంగా ఉంటాయని ఆయన గుర్తు చేశారు.

ఫిలిం ఛాంబర్ వేదికగా తాను ఆమరణ నిరాహార దీక్ష

ఇదిలా ఉండగా, ఈ వివాదంపై టాలీవుడ్ సీనియర్ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తెర వెనుక రాజకీయాలు నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకవేళ ఎగ్జిబిటర్లు ‘పెద్ది’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని చూస్తే, మే 27 బుధవారం ఉదయం 10 గంటల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ వేదికగా తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని నట్టికుమార్ హెచ్చరించారు. కొందరి స్వార్థ ప్రయోజనాల ఆటలకు బలికావద్దంటూ ఎగ్జిబిటర్లను కోరారు.

“మీరు #PEDDI సినిమా ఇదే ప్రకారంగా ఆపాలని నిర్ణయం ఏమైనా తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటాను.” pic.twitter.com/NaeuuHtT7Q

ఆమరణ దీక్షకు సిద్ధమంటున్న నిర్మాత

— Whynot Cinemas (@whynotcinemass_) May 23, 2026

గతంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ఈ సరికొత్త యాక్షన్ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ రన్నర్, క్రికెటర్, కుస్తీ వీరుడిగా మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇండస్ట్రీలో గతంలో వచ్చిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల కంటే భిన్నంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రన్‌పైనే ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల చూపు పడింది. మరికొద్ది రోజుల్లోనే అంటే జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ చుట్టుముట్టిన కాంట్రవర్సీకి ఏ విధంగా ఎండ్ కార్డ్ పడుతుందో కాలమే డిసైడ్ చేయాలి !

‘పెద్ది’ సినిమా విడుదల వివాదం టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసింది. మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు, ఆమరణ దీక్ష హెచ్చరికలు పరిశ్రమలో మరింత ఉద్రిక్తతను పెంచుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.