|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మా మీద బతికే లుచ్చా నా కొడకా.. నడిరోడ్డుపై ఉరితీస్తా.. హాట్ టాపిక్‌గా మారిన నిర్మాత వీడియో

Published: 21-10-2025, 11:29 AM
మా మీద బతికే లుచ్చా నా కొడకా.. నడిరోడ్డుపై ఉరితీస్తా.. హాట్ టాపిక్‌గా మారిన నిర్మాత వీడియో

కిరణ్ అబ్బవరం నటించిన ‘కె-ర్యాంప్’ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే, ఒక న్యూస్ పోర్టల్ తప్పుడు వార్తలు ప్రచారం చేయడంతో నిర్మాత రాజేష్ దండా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Key Points

1

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా నటించిన ‘కె-ర్యాంప్’ చిత్రం విజయవంతంగా నడుస్తోంది.

2

ఒక న్యూస్ పోర్టల్ సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తోందని నిర్మాత రాజేష్ దండా ఆగ్రహం వ్యక్తం చేశారు.

4

నిర్మాత వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

‘కె-ర్యాంప్’ సినిమా విజయంపై తప్పుడు ప్రచారం

కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యుక్తి తరేజా కాంబోలో వచ్చిన ‘కె-ర్యాంప్’ (K-Ramp)సూపర్ హిట్‌గా నిలిచింది. నరేష్ వీకే, సాయి కుమార్ కీలక పాత్రలో నటించగా.. జైన్స్ నాని (Jains Nani)దర్శకత్వంలో వచ్చింది. రాజేష్ దండా, శివ బొమ్మన నిర్మించారు. ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. అయినప్పటికీ ఓ న్యూస్ పోర్టల్ చెడుగా ప్రచారం చేస్తోంది. తాజాగా, ‘కె-ర్యాంప్’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న నిర్మాత రాజేష్ దండా తప్పుడు వార్తలు రాస్తున్న వారిని హెచ్చరించారు. ‘‘మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ ఒక వెబ్‌సైట్ మాత్రం ఇంకా మీ మీద ఏడుస్తుంది. వాడికి చెబుతున్నా, అమెరికాలో ఉన్న ప్రదీప్ గాడికి పగలగొడతా. నీకేం తెలుసురా లుచ్చా నా కొడకా? ఏదో వేస్తున్నావ్.. అది తెలుగు తమిళ్‌రా కుక్క. తొక్కుతావా సినిమాని? తొక్కరా నువ్వు మగాడివైతే. ఒక హిట్ చిత్రాన్ని ఇంకా తొక్కాలని చూస్తున్నా ఈ నా కొడుకు. ఇలాంటి వాళ్లని ఏం చేయాలి? మా మీద బతికే నా కొడకా? ఉరితీయాలి వీళ్ళని నడిరోడ్డు మీద’’ అంటూ ఫైర్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

నిర్మాత రాజేష్ దండా సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

నిర్మాత రాజేష్ దండా చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి ఘటనలు జర్నలిజం విలువలు, సినిమా ప్రమోషన్స్ గురించి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.