|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పునర్నవి పెళ్లి పీటలెక్కబోతోంది! ఆమె భర్త ఎవరు? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

Published: 19-02-2026, 10:05 PM
పునర్నవి పెళ్లి పీటలెక్కబోతోంది! ఆమె భర్త ఎవరు? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!
  • పునర్నవి భూపాలం త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
  • ఆమె కాబోయే భర్త పేరు హేమంత్ వర్మ, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్.
  • హేమంత్ వర్మ తండ్రి ఒక బిజినెస్ మాన్, వీరు సంపన్న కుటుంబానికి చెందినవారు.
  • పునర్నవి ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొంది.

టాలీవుడ్ హీరోయిన్ పునర్నవి భూపాలం త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఆమె కాబోయే భర్త హేమంత్ వర్మ ఒక ఫోటోగ్రాఫర్. అతను సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని సమాచారం.

పునర్నవి భూపాలం వివాహం

Punarnavi Bhupalam:  టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. ప్రస్తుతం దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నారు.. ఈ మధ్య చాలామంది కుర్ర హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీకి దూరమవ్వడంతో పాటుగా పై చదువుతూ బిజీగా ఉన్నారు.. అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పునన్నవి భూపాలం.. తెలుగులో ఉయ్యాల జంపాల అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ మూవీ భారీ సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ ని సొంతం చేస్తుంది..

సినీ ఇండస్ట్రీ నుంచి పలు సినిమా ఆఫర్లు వచ్చినా కూడా ఆమె నో చెప్పేసింది.. ఇన్నాళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది.. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది. తాజాగా ఆమె పెళ్లి పత్రిక ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు కాబోయే భర్త గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం..

హేమంత్ వర్మ నేపథ్యం

సినిమాలకు దూరం అయిన పునర్నవి విదేశాల్లో చదువును పూర్తి చేసుకుంది. అయితే ఆ తర్వాత అయినా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గతంలో ఓసారి ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చింది. తనకు కాబోయే భర్త పేరు హేమంత్ వర్మ.. అతను ఒక ఫోటోగ్రాఫర్ అన్న విషయం చాలామందికి తెలియదు. ఈయన ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆట.. అయితే ఆయన ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. హేమంత్ వర్మ వాళ్ళ తండ్రి ఒక బిజినెస్ మాన్ అని తెలుస్తుంది.. లగ్జరి ఇల్లుతో పాటుగా కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఓ మంచి ఇంటికి కోడలు కాబోతుంది. తాజాగా ఈమె పెళ్లికి సంబంధించిన లగ్న పత్రికను కూడా పూర్తి చేశారు. త్వరలోనే మూడుముళ్ల బంధం లోకి అడుగు పెట్టబోతోంది..

పునర్నవి సినీ కెరీర్

టాలీవుడ్ ముద్దుగుమ్మ పునర్నవి భూపాలం సినిమాల నుంచి దూరంగా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆమె కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఎన్ని సినిమా అవకాశాలు వచ్చినా సరే తాను ఇక సినిమాలు చేయను అని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం విదేశాల్లో చదువుని పూర్తి చేస్తున్న ఈమె అక్కడే తన బాయ్ ఫ్రెండ్ ని కలిసినట్టు తెలుస్తుంది. హేమంత్ వర్మ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఆమెకు ప్రపోజ్ చేసి పెళ్లి పీటలు వరకు తీసుకెళ్లాడు. మొత్తానికి వీళ్లిద్దరూ మరికొద్ది రోజుల్లో మూడుముళ్ల బంధం లోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈమె గతంలో రఘునందన్ అనే ఒక యూట్యూబర్తో ప్రేమాయణం నడిపిస్తుందని వార్తలు వినిపించాయి ఇప్పుడు ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్న మరో న్యూస్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా కూడా ఆ రూమర్స్ పై ఎక్కడ స్పందించకుండా ఆమె తన బాయ్ ఫ్రెండ్b పెళ్లికి సిద్ధమైంది.. ఈ పునన్నవి పెళ్ళికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం..

మొత్తానికి పునర్నవి భూపాలం ఒక మంచి కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టబోతోంది. త్వరలోనే ఆమె వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.