
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల గ్రాండ్ వెడ్డింగ్ ఫిబ్రవరి 26న జరిగింది – ఫోటోలు వైరల్!
- పెళ్లి తర్వాత వెంటనే మాన్యవర్ యాడ్ లో మెరిసిన ఈ జంట – అభిమానులకు పండగే!
- పెళ్లికి ముందే షూటింగ్ పూర్తి.. కానీ రిలీజ్ మాత్రం ఇప్పుడే – కారణం ఇదే!
- భారీ రెమ్యునరేషన్ అందుకున్న విజయ్, రష్మిక – టాలీవుడ్ లో హాట్ టాపిక్!
టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి తర్వాత ఫస్ట్ యాడ్ రిలీజ్ అయింది. ఈ జంటను స్క్రీన్ మీద చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ యాడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఫిబ్రవరి 26న గ్రాండ్ గా విజయ్, రష్మికల పెళ్లి!
Rashmika Vijay : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల ఫిబ్రవరి 26న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో మార్చ్ 4న హైదరాబాద్ లో రిసెప్షన్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం విజయ్ – రష్మిక పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.
పెళ్లి తర్వాత మొదటిసారి విజయ్ – రష్మిక కలిసి నటించిన ప్రకటనను రిలీజ్ చేసారు. మాన్యవర్ అనే వెడ్డింగ్ క్లాత్ బ్రాండ్ కి వీరిద్దరూ కలిసి ఒక యాడ్ చేసారు. ఇది పెళ్ళికి ముందే షూట్ చేసి ఇప్పుడు పెళ్లి తర్వాత రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. పెళ్లితో నేషనల్ వైడ్ విజయ్ – రష్మికకు మరింత ఫేమ్ వచ్చింది.
మాన్యవర్ యాడ్ లో మెరిసిన ఈ జంట.. వైరల్ అవుతున్న వీడియో!
ఆ ఫేమ్ ని మొదట మాన్యవర్ వాడుకొని ఇలా యాడ్ చేసింది. ఈ యాడ్ కోసం ఇద్దరికీ భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పెళ్ళి బ్యాక్ డ్రాప్ లో ఓ సాంగ్ తో ఈ యాడ్ సాగింది. ఈ యాడ్ లో ఇద్దరూ సరదాగా గొడవపడి మళ్ళీ కలిసి పెళ్లి చేసుకొని డ్యాన్స్ చేసినట్టు చూపించారు. పెళ్లి తర్వాత వీరిద్దరి ఫస్ట్ యాడ్ రావడంతో ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు.
భారీ రెమ్యునరేషన్ తో రచ్చ చేసిన లవ్ బర్డ్స్!
మీరు కూడా విజయ్ – రష్మిక పెళ్లి తర్వాత మొదటి యాడ్ వీడియోని చూసేయండి..
విజయ్, రష్మికల జోడీ సూపరని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.


