
📌 Key Points
- పుష్ప 3లో ఎర్రచందనం సామ్రాజ్యాన్ని పుష్పరాజ్ ఎలా తిరిగి పొందుతాడో చూడవచ్చు.
- పుష్ప 3 షూటింగ్ 2027 వేసవిలో ప్రారంభం కానుందని సమాచారం.
- సుకుమార్ పుష్ప 3 స్క్రిప్ట్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో ఆఫీస్ ఏర్పాటు చేశారు.
- పుష్ప 2 క్లైమాక్స్‌లో పుష్ప 3 ప్రకటనతో అంచనాలు పెరిగాయి.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 3తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.
పుష్ప 3 స్టోరీ లైన్ వివరాలు
Pushpa 3:పుష్ప.. అల్లు అర్జున్ (Allu Arjun) ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన తొలి చిత్రం అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సుకుమార్ టేకింగ్.. అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మెన్స్.. శ్రీవల్లిగా రష్మిక మందన్న.. ఇక తొలిసారి అందాలు ఆరబోస్తూ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేసిన సమంత.. ఇలా ఒక్కరేమిటి ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు తమ టాలెంట్ కు మించి పనిచేసి సినిమాకు ఒక రేంజ్ ను అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించడమే కాకుండా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అటు ఈ చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 2: ది రూల్ అంటూ మరో మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు అల్లు అర్జున్. ఈ సినిమా ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది. సుమారుగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమాతో పుష్ప మేనియా అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 : ర్యాంపేజ్ ను ప్రకటించి మరింత అంచనాలు పెంచారు డైరెక్టర్ సుకుమార్ (Sukumar). ముఖ్యంగా కొన్ని సస్పెక్ట్ పాత్రలను పుష్ప 2 క్లైమాక్స్ లో వదిలేసి పుష్ప 3 పై అంచనాలు పెంచారు. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి పుష్ప 3 ర్యాంపేజ్ కోసం సుకుమార్ రాసుకున్న ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..
స్క్రిప్ట్ కోసం ప్రత్యేక ఆఫీస్
విషయంలోకి వెళ్తే.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్ప 2 సినిమా ఇటీవల సంక్రాంతిని పురస్కరించుకొని జపాన్ లో కూడా విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 3 గురించి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ చాలా వేగంగా సిద్ధం చేస్తున్నారట. పైగా హైదరాబాదులో ప్రత్యేకంగా ఒక ఆఫీసును అద్దెకు తీసుకొని మరీ దీనిపై పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ మూడవ సినిమాలో తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని…ప్రాణాలతో బ్రతికి బయటపడ్డ పుష్పరాజ్ ఎలా కైవసం చేసుకుంటాడు? అనే స్టోరీ చుట్టూ తిరగనుంది అని సమాచారం. ముఖ్యంగా శత్రువులతో పాటు వెన్నుపోటు పొడిచిన వాళ్ళ అంతు కూడా చూస్తారట. ఈ సినిమా షూటింగ్ 2027 వేసవి నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం.. ఏది ఏమైనా ఈ ఒక్క స్టోరీ లైన్ ఇప్పుడు అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు.
2027లో షూటింగ్ ప్రారంభం
అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజుతో కూడా అల్లుఅర్జున్ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాపై అధికారిక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతనే పుష్ప3 ప్రారంభం కానున్నట్లు సమాచారం.
మొత్తానికి పుష్ప 3 గురించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్పరాజ్ తన శత్రువులను ఎలా ఎదుర్కొంటాడో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


