|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సోషల్ మీడియాకు రామ్ చరణ్ దూరం! అసలు విషయం బయటపెట్టిన నిహారిక..

Published: 02-04-2026, 6:05 AM
సోషల్ మీడియాకు రామ్ చరణ్ దూరం! అసలు విషయం బయటపెట్టిన నిహారిక..
  • రామ్ చరణ్ ‘పెద్ది సినిమా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
  • నిహారిక సినిమా ప్రమోషన్లలో రామ్ చరణ్ పాల్గొంటున్నారు.
  • రామ్ చరణ్‌కు సోషల్ మీడియా గురించి పెద్దగా తెలియదని నిహారిక వెల్లడించారు.
  • పెద్ది సినిమా విడుదల వాయిదా పడలేదని చరణ్ చెప్పారని నిహారిక తెలిపారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ‘పెద్ది సినిమా’తో బిజీగా ఉంటూనే, చెల్లెలు నిహారిక సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిహారిక, చరణ్‌కు సోషల్ మీడియా గురించి పెద్దగా తెలియదని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

రామ్ చరణ్ ‘పెద్ది సినిమా’ అప్డేట్స్

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) ప్రస్తుతం పెద్ది సినిమా(Peddi Movie) పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇలా ఒకవైపు తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే రామ్ చరణ్ మరోవైపు తన చెల్లెలు నిహారిక (Niharika)సినిమా కోసం తమ సమయాన్ని కేటాయిస్తూ చెల్లెలు సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ నిహారికతో కలిసి రాకాస(Raakaasaa) సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందంతో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇందులో భాగంగా రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చారు.

పెద్ద సినిమా లేట్ అవ్వట్లేదు మీరు కాస్త ప్రమోట్ చేయండి అంటూ చరణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే పెద్ది సినిమా వాయిదా పడటం లేదని భావిస్తున్నారు కానీ చిత్ర నిర్మాతలు మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అయోమయంలో ఉన్నారు. ఇకపోతే తాజాగా నిహారిక సినిమా మరికొన్ని గంటలలో ప్రీమియర్ కాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నిహారికకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

నిహారిక సినిమా ప్రమోషన్స్‌లో చరణ్

రామ్ చరణ్ పెద్ది సినిమా లేట్ అవ్వట్లేదు అని చెప్పడానికి గల కారణాలు ఏంటి అనే ప్రశ్న ఎదురు కావడంతో నిహారిక సమాధానం చెబుతూ.. రాకాసా సినిమా ప్రమోషన్లలో భాగంగా మేము చేసే ప్రతి ఒక్క వీడియో అందరికీ బాగా రీచ్ అవుతుంది. సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న రామ్ చరణ్ అన్న మా ప్రమోషన్ల గురించి మాట్లాడుతూ చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు అంటూ ప్రశంసించారు. ఇలా తమ ప్రమోషనల్ వీడియోస్ బాగా రీచ్ అవుతున్న నేపథ్యంలో పెద్ది సినిమా కూడా లేట్ అవ్వడం లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియచేయండి అంటూ చరణ్ అన్న కోరారు.

సోషల్ మీడియా వాడటం తెలియదు..

సోషల్ మీడియాపై రామ్ చరణ్ కామెంట్స్

ఇలా చరణ్ అన్న చెప్పడంతోనే పెద్ద సినిమా లేట్ అవ్వట్లేదు అంటూ మా ప్రమోషన్ల ద్వారా తెలియచేసామని నిహారిక తెలిపారు. నిజానికి చరణ్ అన్న సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. సోషల్ మీడియా గురించి చరణ్ అన్నకు ఏ మాత్రం తెలియదు. ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉండే చరణ్ అన్న వరకు మా ప్రమోషన్ వీడియోలు వెళ్లాయి అంటే రాకాసా విషయంలో మేం అనుకున్నది జరుగుతోందని నిహారిక తెలిపారు. అందుకే పెద్ది లేట్ అవ్వట్లేదు అనే విషయాన్ని మా ద్వారా తెలిపామని నిహారిక ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా నిహారిక చరణన్నకు సోషల్ మీడియా గురించి ఎలాంటి ఐడియా లేదని చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవ్వడమే కాకుండా అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. చరణ్ గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటిది సోషల్ మీడియా వాడటం తెలియదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి నిహారిక తన అన్నయ్య రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.