
పుట్టుమచ్చలు శరీరంపై చిన్న మచ్చలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వీటి స్థానం, రంగు, పరిమాణం ఆధారంగా వ్యక్తి జీవితం, భాగ్యం, ధనం గురించి తెలుసుకోవచ్చు. ఈ కథనంలో కొన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం.
Key Points
కుడి కణతపై పుట్టుమచ్చ: ఆకస్మిక ధనలాభం!
కుడి కన్ను, నుదురుపై మచ్చలు: భోగభాగ్యాలు!
కుడి అరచేతి, తొడపై మచ్చలు: ఆస్తి ప్రాప్తి!
కంఠం, మణికట్టుపై మచ్చలు: వారసత్వ ధనం!
శరీరంలోని వివిధ భాగాలలో పుట్టుమచ్చల ప్రభావం
పుట్టుమచ్చలు అంటే శరీరంపై పుట్టుకతోనే లేదా కాలక్రమేణా ఏర్పడే చిన్న చర్మపు మచ్చలు. వీటిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గమనించి వ్యక్తి జీవిత లక్షణాలు, భాగ్యం, బుద్ధి, వైభోగం మొదలైన అంశాలను అంచనా వేస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఇవి శరీరంలో ఉన్న స్థానం, రంగు, పరిమాణం ఆధారంగా వాటి ఫలితాలు మారుతాయి.
ఈ క్రిందిస్థానంలో పుట్టుమచ్చలు ఉన్నయెడల ధనం సంపాదించుటలో మంచి సాధనవంతీయకులు కలిగి యుందురు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. బాల్యములో తక్కువ దశలో ఉన్న క్రమేపి ధనవంతులు కాగలరు. ఆకస్మికంగా ధన లాభములు కలిగి లక్షాధికారులు అగుదురు. జీవితములో సకల భోగ భాగ్యములను సుఖములను అనుభవించుదురు.
1. కుడికణతపై 2. ఎడమకణతపై 3. కుడి కనుబొమ్మమీద 4. కుడి కంటిలో నల్ల గ్రుడ్డుకు ఎడమ భాగమున 5. కుడికన్ను రెప్ప లోపలి భాగమున, 6. నుదరు కుడి భాగమున, 7 ముక్కుకి కుడివైపున, 8 గడ్డమునకు మధ్యభాగమున 9.పెదవి క్రింద, 10 గడ్డమునకు కుడిభాగమున, 11.కంఠమునకు రెండు వైపులను, 12. రొమ్మునకు కుడిభాగమున.
13.కుడి అరచెయ్యి చిటికెన వ్రేలు క్రింద. 15. మణికట్టునకు ఇరువైపుల ఏ భాగమునందైనా 16. కుడి తొడ మీద ఉన్నఎడల స్త్రీ ధనంను తన తెలివితేటలతో అభివృద్ధి పరచును. 17. వృషణముల మీద 18.కుడి మోకాలు మీద పుట్టుమచ్చలు ఉన్న భోగభాగ్యాలు సకలైశ్వర్యాలు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు
పుట్టుమచ్చలు మరియు ఆకస్మిక ధనలాభం
1. నుదురు భాగం విశాలంగా నుండి కుడివైపు పుట్టుమచ్చ ఉన్నచో అనుకోకుండా ధనప్రాప్తి,
2 కుడి కణత మీద ఉన్న లాటరీలు వలన లేదా వారసత్వము వలన కాని ఆకస్మిక ధన లాభములు కలుగును. ఈ మచ్చ స్పష్టంగా, ఉబ్బెత్తుగాను ఉండవలెను.
3. కుడికంటిలో ఉంటే భోగ భాగ్యములు అనుభవించెదరు.
4. కంఠమునకు పై భాగము నందు ఉన్నవారసత్వమువలన గాని బంధు మూలకముగా కానీ ధనప్రాప్తి కలుగును.
పుట్టుమచ్చల ఆధారంగా భవిష్యత్తు అంచనా
5. కుడి అరచేతి ఎడమ భాగమున ఉన్నచో ఏ విధమైన ప్రయత్నములు చేయకనే గుర్రప్పందెములందు లేదా లాటరీలలో విజయం కలిగి ధనలాభములు కలుగును.
6. కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న యెడల భార్య వలన గాని పరస్త్రీ మూలకముగా గాని ఆస్తి లభించును.
7. కుడి కనుబొమ్మ మీద ఉన్న యెడల భార్య వలన ఆస్తి లభించును లేదా భార్య వచ్చిన తరువాత డబ్బు బాగా సంపాదించగలరు. లేని యెడల పర స్త్రీలవలన గాని ధనప్రాప్తి కలుగును అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పుట్టుమచ్చల స్థానం ఆధారంగా జీవితంలోని వివిధ అంశాలను అంచనా వేయవచ్చు. కానీ, ఇవి కేవలం సూచనలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.


