|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాకా టైటిల్ వెనుక అసలు కథ ఇదేనా? బన్నీ ఊరమాస్ అవతార్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 09-04-2026, 12:05 PM
రాకా టైటిల్ వెనుక అసలు కథ ఇదేనా? బన్నీ ఊరమాస్ అవతార్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో ‘రాకా’ మూవీ టైటిల్ ఫిక్స్ – సంస్కృతంలో నిండు పున్నమి అని అర్థం!
  • భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘రాకా’ – బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలవనుంది!
  • బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
  • పాన్ ఇండియా మూవీగా ‘రాకా’ విడుదల – బన్నీ ఫ్యాన్స్ కు పండుగే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న రాకా సినిమా టైటిల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా టైటిల్ వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి? బన్నీ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాకా అంటే నిండు పున్నమి.. బన్నీ పాత్రలో ఆ మాయేంటో?

అల్లు అర్జున్ కొత్త సినిమా రాకా. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న సినిమా ఇది. రాకా అనే టైటిల్ ఎంతో మందికి ఆసక్తి కలిగిస్తుంది. ఆ పేరు చుట్టూ అల్లుకున్న కథ ఎలా ఉంటుందో అనే ఆత్రుత కూడా ఎంతో మందికి ఉంది. రాకా పేరు ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రాకా అనేది సంస్కృత పదం. దీనికర్థం నిండు పౌర్ణమి అని అర్థం. చంద్రుని నిండు వెలుగులో ప్రకృతి శక్తులు ఎలాగైతే ప్రభావితం అవుతాయో, ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కూడా పౌర్ణమి రాత్రులలో ఒక విలక్షణమైన శక్తిగా మారుతుందని సమాచారం. ఇదొక ఫిక్షన్, సోషియో-ఫాంటసీ డ్రామాగా అట్లీ తీస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు బన్నీ. రాకా దాదాపు 900 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో రాకా కూడా ఒకటిగా నిలవబోతోంది.

ఈ సినిమా కథ గురించి ఇండస్ట్రీలో ఎన్నో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇందులో ఒక తోడేలు మనిషి తరహా పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒక అతీంద్రియ శక్తులున్న యోధుడిలా కనిపించబోతున్నాడని సమాచారం. విడుదలైన పోస్టర్‌లో బన్నీ లుక్ చాలా రఫ్ గా, కళ్ళలో ఒక విధమైన ఫీలింగ్ కనిపిస్తోంది. పౌర్ణమి నాడే అల్లు అర్జున్ పాత్రలోని తోడేలు రూపం బయటపడుతుందని, అందుకే ఈ చిత్రానికి ‘రాకా’ అనే పేరు పెట్టారని తెలుస్తోంది. హిందీ కామిక్స్‌లో ‘రాకా’ అనే పాత్ర బాగా ఫేమస్. అట్లీ తన సినిమాల్లో హీరోలను అత్యంత శక్తివంతంగా, ఎమోషనల్ గా చూపిస్తారనే పేరుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది మంచి పాత్రగా నిలిచిపోయే అవకాశం ఉంది.

900 కోట్ల భారీ బడ్జెట్ తో రాకా.. ఇండియన్ సినిమా రికార్డ్స్ బ్రేక్!

అట్లీ రాకా కోసం ఫేమస్ నటులను ఎంపిక చేశారు. అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తోంది. దీంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై ఒక మ్యాజిక్ సృష్టించడం ఖాయ. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పనిచేస్తున్నాడు. అట్లీ బన్నీతో కలిసి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధపడుతున్నారు. కేవలం తెలుగు, తమిళ భాషలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పదికి పైగా భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

తోడేలు మనిషిగా బన్నీ.. బాలీవుడ్ లోనూ భారీ అంచనాలు!

‘రాకా’ సినిమా అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా. పౌర్ణమి వెలుగులో దాగున్న రహస్యం ఏమిటి? రాకాగా బన్నీ చేసే విధ్వంసం ఎలా ఉండబోతోంది? చూసేందుకు వారు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి 2027 లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సోషల్ మీడియాలో రాకా ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

రాకా సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.