|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాకాస విధ్వంసం: నిహారిక, సంగీత్‌ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టా? రివ్యూ చూస్తే షాక్!

Published: 03-04-2026, 4:35 AM
రాకాస విధ్వంసం: నిహారిక, సంగీత్‌ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టా? రివ్యూ చూస్తే షాక్!
  • సంగీత్‌ శోభన్‌, నయన సారిక జంటగా రాకాస మూవీ విడుదల, కామెడీ థ్రిల్లర్‌గా చిత్రం.
  • అమెరికా నుంచి వచ్చిన హీరో, ఊరి ఆచారాల మధ్య చిక్కుకున్న కథాంశం.
  • వెన్నెల కిశోర్‌, గెటప్ శ్రీను కామెడీ టైమింగ్‌తో సినిమాకు మరింత ప్లస్.
  • నిహారిక నిర్మాణంలో, మానస శర్మ దర్శకత్వంలో రాకాస మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?

మెగా డాటర్ నిహారిక నిర్మించిన రాకాస మూవీ విడుదల అయింది. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ.

రాకాస మూవీ స్టోరీ లైన్ ఏంటి?

మెగా డాటర్‌ నిహారిక `కమిటీ కుర్రోళ్లు` తర్వాత నిర్మించిన చిత్రం `రాకాస`. మ్యాడ్‌ హీరో సంగీత్‌ శోభన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్‌గా చేసింది. లేడీ డైరెక్టర్‌ మానస శర్మ దర్శకత్వం వహించింది. జీ స్టూడియోస్‌ సమర్పణలో, పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌తో కలిసి నిహారిక ఈ మూవీని నిర్మించింది. టీజర్‌, ట్రైలర్‌లతో ఈ మూవీకి మంచి బజ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ చిత్రం నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 3)న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? నిహారిక మరో హిట్‌ కొట్టిందా? సంగీత్ శోభన్‌ నవ్వించాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

వీరబాబు(సంగీత్‌ శోభన్‌) అమెరికా నుంచి తాను ప్రేమించిన సుకన్య కోసం ఊరొస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో ఆమెకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. తన ముందే ఆమెకి పెళ్లి అవుతుంది. దీంతో వీరబాబు హార్డ్ బ్రేక్‌ అవుతుంది. ఆ బాధలో ఉన్నప్పుడు సుబ్బలక్ష్మి(నయన సారిక) అతన్ని ఓదార్చుతుంది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. అయితే ఊర్లో సోము(వెన్నెల కిశోర్‌)ని చంపేసిన ఆరోపణలతో ఊరు పెద్దలు వీరబాబుకి ఊరు బహిష్కరణ శిక్ష వేస్తారు. ఆ సమయంలో సుబ్బలక్ష్మి అండగా ఉంటుంది. ఆ ఊరు ఆచారం ప్రకారం ప్రతి ఏడాది కోటలోని రాక్షసుడికి ఒకరిని బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సారి ఓ వృద్ధుడిని పంపించగా, అతను ముందే చనిపోతాడు. దీంతో ఆ తర్వాత పేరున్న తన స్నేహితుడు బాలరాజు(గెటప్‌ శ్రీను)ని పంపాల్సి ఉంటుంది. స్నేహితుడు కోసం వీరబాబు రాక్షసుడికి బలిగా కోటలోకి వెళ్తాడు. అక్కడ తాను ఎలాంటి అనుభవాలు ఫేస్‌ చేశాడు? కోటలో నిజంగానే రాక్షసుడు ఉన్నాడా? అందులో సోను ఎందుకు ఉన్నాడు? ఆ రాక్షసుడి కథేంటి? ఆ కోటకి ఉన్న చరిత్ర ఏంటి? వీరబాబు కోసం సుబ్బలక్ష్మి ఎలాంటి సాహసం చేసింది? ఆ కోటలో నుంచి వీరబాబు బయటపడ్డాడా? లేదా? ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగిలిన సినిమా.

మిస్టరీ, కామెడీ థ్రిల్లర్‌ సినిమాలు ఇటీవల మంచి ఆదరణ పొందుతున్నాయి. నవ్విస్తూ, థ్రిల్‌ కి గురిచేస్తూ ఆకట్టుకున్నాయి. ఆ కోవలోనే `రాకాస` మూవీని రూపొందించారు. ఇందులో కొంత ఫాంటసీ ఎలిమెంట్లని జోడించారు. అది ఈ మూవీకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పొచ్చు. సినిమా ప్రారంభం నుంచి కామెడీ ప్రధానంగా సాగుతుంది. సంగీత్‌ శోభన్‌ తన భుజాలపై వేసుకుని కథని నడిపించాడు. సందర్భానుసారంగా తాను చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. తన ప్రియురాలు సుకన్య కోసం అమెరికా నుంచి రావడం, ఆమె హీరోకి హ్యాండిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం, ఈ క్రమంలో హీరో పదే బాధ నవ్వులు పూయిస్తుంది. అయితే ఆ ఊరిలో ఉన్న కోట కొన్ని తరాలుగా మనుషులను చంపేయడం, దీంతో ప్రతి ఏడాది అందులోని రాక్షసుడికి ఒకరిని బలిగా పంపించే సన్నివేశాలు సినిమా రేంజ్‌ ని పెంచాయి. ప్రారంభంలో వచ్చే ఆ సీన్లు ఆకట్టుకున్నాయి. ఊహించిన విధంగా ఉంటాయి. అవి సర్‌ప్రైజ్‌ అని చెప్పొచ్చున ఆ తర్వాత సంగీత్‌ శోభన్ ఆ ఊరిలోకి రావడం, ఆ ఊరి సమస్యలో ఇరుక్కోవడం, అనంతరం సందర్భానుసారంగా క్రియేట్‌ అయే కామెడీ ఆద్యంతం అలరిస్తుంది. సీరియస్‌ సన్నివేశాల్లోనూ కామెడీని జోడించిన తీరు బాగుంది. అలరించింది. ఇదే ఇందులో ఉన్న స్పెషాలిటీగా చెప్పొచ్చు. ఆ ఊర్లో సంగీత్‌ చేసే అల్లరి, రచ్చ హిలేరియస్‌గా ఉంటుంది. ఇక కోటలోకి అతను వెళ్లాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. అందులోని యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు గూస్‌బంమ్స్ తెప్పిస్తాయి. భయపెడుతూనే థ్రిల్‌కి గురి చేస్తాయి. ట్విస్ట్ లు, టర్న్ లు మెప్పిస్తాయి. అందులోనూ ఒక్కో పాత్ర ఎంట్రీ ఇస్తుండటంతో సినిమా మరింత హిలేరియస్‌గా మారుతుంది. హీరో, హీరోయిన్‌, గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్‌, రాక్షసుడికి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. భయపెడుతూనే కట్టిపడేస్తాయి. ఇక క్లైమాక్స్ లో మరింత ఆకట్టుకుంటూ, ఎంగేజ్‌ చేస్తూ, థ్రిల్‌కి గురి చేస్తూ ముగించిన తీరు, అలాగే కామెడీని, థ్రిల్‌ మూమెంట్‌కి జోడించిన తీరు అదిరిపోయింది. ఇదొక సాహసమనే చెప్పాలి.. సినిమా మొత్తం ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ఫన్‌, థ్రిల్‌తో కూడిన రోలర్‌ కోస్టర్‌గా సాగుతుంది. అయితే ఫన్‌ ఆశించిన స్థాయిలో వర్క్ కాకపోవడం, అనవసరమైన లౌడ్‌ కొంత మైనస్‌గా చెప్పొచ్చు.

సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ ఎలా ఉంది?

వీరబాబుగా సంగీత్‌ శోభన్‌ నటన మూవీకి మెయిన్‌ హైలైట్‌ అవుతుంది. తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. సినిమాని నడిపించారు. ఆయనకు గెటప్‌ శ్రీను తోడయ్యారు. వీరి మధ్య సీన్లు ఫస్టాఫ్‌లో నవ్వులు పూయిస్తాయి. అలాగే సెకండాఫ్‌లో వెన్నెలకిశోర్‌ పాత్ర ఎంట్రీ ఉంటుంది. కోటలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి. నవ్విస్తూనే భయపెట్టిన తీరు బాగుంది. వాళ్ల బాధ, మనకు నవ్వులు పూయిస్తాయి. ఇక సుబ్బలక్ష్మిగా నయన సారిక నటన బాగుంది. ఆమెకి మంచి ప్రయారిటీ ఉన్న పాత్ర పడింది. అదరగొట్టింది. ఊరి పెద్దగా బ్రహ్మాజీ సీరియస్‌ రోల్‌లో మెప్పించారు. చారీగా తనికెళ్లభరణి ఆకట్టుకున్నాడు. రోహన్‌ కూడా నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

టెక్నీకల్‌గా మూవీ సాలిడ్‌గా ఉంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. సినిమా ఎక్కడా చిన్న మూవీ అనే ఫీలింగ్‌ రాలేదు. భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తలపించింది. అనుదీప్‌ దేవ్‌ సంగీతం హైలైట్‌ అవుతుంది. బీజీఎం అదిరిపోయింది. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. బీజీఎం సినిమా స్థాయిని పెంచింది. రాజు ఎదురోలు కెమెరా వర్క్ కనువిందు చేస్తుంది. విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. వాటిని అస్సలు ఊహించరు. అన్వర్‌ అలీ ఎడిటింగ్‌ బాగుంది. క్రిస్పీగా కట్‌ చేశారు. దర్శకురాలు మానస శర్మ తీసుకున్న కథ చాలా కొత్తగా ఉంది. దాన్ని అంతే కొత్తగా తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చేశారు. కామెడీని వర్కౌట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు. అదే సమయంలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లని కూడా బాగా ప్లాన్‌ చేశారు. అవి గూస్‌ బంమ్స్ తెప్పిస్తాయి. కామెడీ పరంగా ఇంకా బాగా వర్క్ చేయాల్సింది.

సంగీత్‌ శోభన్‌, గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్‌.. ఇలా ఆర్టిస్ట్ ల నటన ఒక హైలైట్‌ అయితే, కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ మరో హైలైట్‌. బీజీఎం అదిరిపోయింది. కోటకి ఉన్న స్టోరీ, కోటలోని ఎపిసోడ్లు హిలేరియస్‌గా ఉంటాయి. క్లైమాక్స్ యాక్షన్‌ సీన్లు అదిరిపోయేలా ఉంటాయి.

సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా?

మైనస్‌ విషయానికి వస్తే, కామెడీ కొన్ని చోట్ల ఓవర్‌ బోర్డ్ వెళ్లినట్టుగా ఉంటుంది. కొన్ని ట్రాక్‌లు లెన్తీగా ఉండటం. కోటలో హర్రర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లపై ఇంకా బాగా ప్లాన్‌ చేయాల్సింది.

ఓవరాల్‌గా రాకాస.. ఆద్యంతం నవ్విస్తూ, థ్రిల్‌కి గురిచేసే మూవీ అవుతుంది. ఈ సమ్మర్‌ కి హాయిగా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్‌ చేసే చిత్రమవుతుంది. సర్‌ప్రైజ్‌లు బోనస్‌.

రాకాస మూవీ ప్రేక్షకులను అలరించే విధంగా ఉందా లేదా అనేది చూడాలి. సంగీత్ శోభన్ నటన ఎలా ఉందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.